Festive Offers: క్యాష్‌బ్యాక్ ఆఫర్లను ప్రకటించిన ఎస్బీఐ కార్డు!
కొన్ని ఎంపికచేయబడ్డ వస్తువులపై 22.5% వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా ఉన్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: పండుగ సీజన్ కోసం ఎస్బీఐ కార్డు అనేక ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రవేశ పెట్టింది. ఈ ఆఫర్లు అక్టోబర్ 31 వరకు అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్లో, ఆఫ్‌లైన్‌లో టైర్ 1, 2, 3కి చెందిన 2600 నగరాల్లో 1600 కంటే ఎక్కువ వస్తువులపై ఈ ఆఫర్లను అందిస్తున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్లలో ఎలక్ట్రానిక్స్, మొబైల్స్, ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్, బంగారు ఆభరణాలు, ట్రావెల్ మార్కెట్లలో అనేక రకాల వస్తువులు, సేవలు అందుబాటులో ఉంటాయి. కొన్ని ఎంపికచేసిన వస్తువులపై 22.50% వరకు కూడా క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఉన్నాయి. 'అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్' కోసం SBI Card అమెజాన్‌తో ప్రత్యేక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
ఇంతేకాకుండా SBI Card.. ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్ మొబైల్, రిలయన్స్ ట్రెండ్స్, పాన్టలూన్స్, రేమండ్స్, ఎల్జీ, సామ్సంగ్, సోని, హెచ్‌పీ, Make My Trip, goibibo వంటి ప్రఖ్యాత బ్రాండ్లతో సహా దాదాపు 28 కీలక అంతర్జాతీయ, దేశీయ బ్రాండ్ల కొనుగోళ్లపై విభిన్న ఆఫర్లను పొందొచ్చు. ఎస్బీఐ కార్డు ఈఎంఐ సౌకర్యాన్ని కూడా అందిస్తోంది. వినియోగదారులు 25కు పైగా ఎలక్ట్రానిక్స్, మొబైల్ బ్రాండ్లలో ఎటువంటి అదనపు వడ్డీ లేకుండా ఈఎంఐ సౌకర్యాన్ని పొందవచ్చు. కొన్ని ఎంపిక చేసిన ప్రాంతీయ వ్యాపారుల వద్ద కూడా ఈఎంఐ లావాదేవీలపై 15% క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను వినియోగదారులు పొందవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
E- insurance: కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి బీమా పాలసీల డిజిటలైజేషన్‌ను తప్పనిసరి చేస్తున్నట్లు ఐఆర్డీఏఐ ప్రకటించింది. -
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
March 31 Deadline: ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో ఆర్బీఐ, ఐఆర్డీఏఐ, ఆదాయ పన్ను విభాగాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. -
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
Afcons Infra IPO: ఐదేళ్ల తర్వాత షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ వస్తోంది. నిర్మాణ రంగ కంపెనీ ఆఫ్కాన్స్ ఇన్ఫ్రా పబ్లిక్ ఇష్యూ కోసం సెబీకి ప్రాథమిక పత్రాలు సమర్పించింది. -
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
స్టాక్ మార్కెట్ సూచీలు గరిష్ఠ స్థాయికి చేరుతుండటంతో ఇటీవల కాలంలో చాలామంది ఇందులో మదుపు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మూడేళ్లుగా ఈక్విటీల్లోకి వస్తున్న పెట్టుబడులే ఇందుకు నిదర్శనం -
31లోగా ఇవి పూర్తి చేయండి..
ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో మార్చి 31 నాటికి పూర్తి చేయాల్సిన కొన్ని పనులు.. ముగుస్తున్న పథకాల వివరాలను పరిశీలిద్దాం.. -
ఒకప్పటి క్రిప్టో కింగ్ శామ్ బ్యాంక్‌మన్‌కు 25 ఏళ్ల జైలు శిక్ష
Sam Bankman Fried: క్రిప్టో ఎక్స్ఛేంజ్ ఎఫ్‌టీఎక్స్ సహ వ్యవస్థాపకుడు శామ్ బ్యాంక్మన్ ఆర్థిక మోసాలు, అక్రమ నగదు చలామణి వంటి నేరాలకు పాల్పడ్డట్లు నవంబరులో తేల్చిన న్యూయార్క్ కోర్టు తాజాగా ఆయనకు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. -
స్టాక్స్ లాభాలు బల్లే బల్లే
ప్రస్తుత (2023-24) ఆర్థిక సంవత్సరాన్ని సూచీలు లాభాలతో ముగించాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో గురువారం సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 1% రాణించాయి. -
షియామీ ఎస్‌యూ7 ఈవీ
షియామీ తన తొలి విద్యుత్ కారు (ఈవీ) ఎస్‌యూ7ను (ఎస్‌యూ అంటే స్పీడ్ అల్ట్రా) గురువారం విడుదల చేసింది. -
నెమ్మదించిన కీలక రంగాల వృద్ధి
దేశీయంగా 8 కీలక మౌలిక రంగాల వృద్ధి గత నెలలో నెమ్మదించింది. ఎరువుల వంటి రంగాల బలహీన పని తీరుతో ఫిబ్రవరిలో కీలక రంగాల వృద్ధి 6.7 శాతానికి పరిమితమైంది. -
ద్రవ్యలోటు రూ.15 లక్షల కోట్లు
ఫిబ్రవరి చివరి నాటికి ప్రభుత్వ ద్రవ్యలోటు రూ.15 లక్షల కోట్లుగా నమోదైంది. బడ్జెట్లో సవరించిన వార్షిక లక్ష్యం రూ.17.35 లక్షల కోట్లలో ఇది 86.5 శాతమని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. -
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఔషధ రంగ వృద్ధి 8-10% : ఇక్రా
వచ్చే ఆర్థిక సంవత్సరంలో, 25 దేశీయ ఫార్మా కంపెనీల ఆదాయాల్లో వృద్ధి 8- 10 శాతానికి మించకపోవచ్చని రేటింగ్ సేవల సంస్థ ఇక్రా లిమిటెడ్ అంచనా వేసింది. -
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై విదేశాల్లో మోసపూరిత లావాదేవీలు
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదార్లలో చాలా మంది మోసపూరిత విదేశీ లావాదేవీలకు బలయ్యారు. -
అంబానీ, అదానీ తొలిసారి కలిశారు
సంపద పరంగా దేశంలో తొలి రెండు స్థానాల్లో ఉన్న కుబేరులు అంబానీ, అదానీ మధ్య వ్యాపార భాగస్వామ్యం కుదిరింది. గుజరాత్‌కే చెందిన వారిద్దరి మధ్య, కనిపించని పోటీ ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటాయి. -
ఎంఎస్డీతో కాంట్రాక్టు తయారీ చర్చల కొనసాగింపు
ఔషధాల కాంట్రాక్టు తయారీ ఒప్పందాల నిమిత్తం బహుళ జాతి ఫార్మా కంపెనీ ఎంఎస్డీ (మెర్క్ షార్ప్ అండ్ దోహ్మే సింగపూర్ ట్రేడింగ్ పీటీఈ లిమిటెడ్), తమ అనుబంధ సంస్థ క్యూరాటెక్ బయోలాజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య జరుగుతున్న సంప్రదింపులు మరో 2 నెలలు కొనసాగుతాయని అరబిందో ఫార్మా వెల్లడించింది. -
యూఏఈలో యూపీఐ చెల్లింపులకు నియోపే టెర్మినళ్లు వాడొచ్చు: ఫోన్‌పే
తమ వినియోగదార్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు (యూఏఈ) వెళ్లినప్పుడు.. అక్కడి మాష్రెఖ్ బ్యాంకుకు చెందిన నియోపే టెర్మినళ్ల ద్వారా యూపీఐ చెల్లింపులు చేయొచ్చని ఫోన్‌పే తెలిపింది. -
చెన్నై రిఫైనరీలో ఐఓసీ వాటా పెంపు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), దాని అనుబంధ సంస్థ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ (సీపీసీఎల్) సంయుక్తంగా ఏర్పాటు చేసిన సంస్థ ఆధ్వర్యంలో చెన్నైలో నిర్మిస్తున్న 9 మిలియన్ టన్నుల రిఫైనరీలో తన వాటాను 75 శాతానికి పెంచుకోనుంది. -
సంక్షిప్తవార్తలు (5)
సూక్ష్మరుణాలు అందించే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ) సొనాటా ఫైనాన్స్ లిమిటెడ్‌ను కోటక్ మహీంద్రా బ్యాంకు రూ.537 కోట్లకు కొనుగోలు చేసింది. -
కొత్త ఆర్థిక సంవత్సరం ఇలా ప్రారంభిద్దాం...
ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే చాలా విషయాల్లో మార్పులు వస్తుంటాయి. ఆదాయపు పన్ను విషయం కావొచ్చు.. బ్యాంకింగ్ సంబంధిత లావాదేవీలు.. ఇలా ఎన్నో ఏప్రిల్ 1 నుంచి మనకు కొత్తగా కనిపిస్తుంటాయి -
పసిడిలో మదుపు 10 శాతమే..
నాకు నెలకు రూ.60వేల వేతనం వస్తోంది. నా వయసు 39. ఇప్పటి వరకూ ఎలాంటి జీవిత బీమా పాలసీలనూ తీసుకోలేదు. ఇప్పుడు ఎలాంటి పాలసీలను తీసుకోవాలి. -
అత్యవసర నిధి ఖర్చులను తట్టుకునేలా
అవసరాలు ఎప్పుడు ఏ రూపంలో పలకరిస్తాయో చెప్పలేం. ఇలా వచ్చేవాటిని తట్టుకునేందుకు ఆర్థికంగా సిద్ధంగా ఉండాల్సిందే. నెలనెలా ఆదాయం వచ్చేదాకా వీటిని వాయిదా వేయలేం. -
ఆరోగ్య బీమా: సమాచారం ఇస్తేనే మేలు
ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు అప్పటి వరకూ ఉన్న ముందస్తు వ్యాధుల గురించి బీమా సంస్థకు తప్పనిసరిగా తెలియజేయాలి.
తాజా వార్తలు (Latest News)
-
సీ-విజిల్‌కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్‌సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM