SBI నుంచి కొత్త క్రెడిట్‌ కార్డ్‌.. ఆన్‌లైన్‌ లావాదేవీలపై 5 శాతం క్యాష్‌బ్యాక్‌

CASHBACK SBI Card: ఎస్‌బీఐ కార్డ్‌ కొత్త క్రెడిట్‌ కార్డును లాంచ్‌ చేసింది. క్యాష్‌బ్యాక్‌ కోరుకునే వినియోగదారులే లక్ష్యంగా క్యాష్‌బ్యాక్‌ ఎస్‌బీఐ కార్డ్‌ పేరిట కొత్త క్రెడిట్‌కార్డును తీసుకొచ్చింది.

Published : 01 Sep 2022 18:24 IST

హైదరాబాద్‌: ప్రముఖ క్రెడిట్‌ కార్డు జారీ సంస్థ ఎస్‌బీఐ కార్డ్‌ (SBI card) కొత్త క్రెడిట్‌ కార్డును లాంచ్‌ చేసింది. క్యాష్‌బ్యాక్‌ కోరుకునే వినియోగదారులే లక్ష్యంగా క్యాష్‌బ్యాక్‌ ఎస్‌బీఐ కార్డ్‌ (CASHBACK SBI Card) పేరిట కొత్త క్రెడిట్‌కార్డును తీసుకొచ్చింది. ఈ కార్డు ద్వారా ఆన్‌లైన్‌లో జరిపే ప్రతి లావాదేవీపై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. ఆఫ్‌లైన్‌ చెల్లింపులపై 1 శాతం క్యాష్‌బ్యాక్‌ పొందొచ్చు. క్యాష్‌బ్యాక్‌ విషయంలో మర్చంట్‌ లిమిట్‌ అంటూ ఏమీ ఉండదని ఎస్‌బీఐ కార్డ్‌ చెబుతోంది.

స్పెషల్‌ ఆఫర్‌ కింద ఈ కాంటాక్ట్‌లెస్‌ క్రెడిట్‌ కార్డ్‌ను తొలి ఏడాది ఉచితంగా అందిస్తున్నట్లు ఎస్‌బీఐ కార్డ్‌ తెలిపింది. 2023 మార్చి వరకు ఉచితంగానే అందివ్వనున్నట్లు ఎస్‌బీఐ కార్డ్‌ ఎండీ, సీఈఓ రామ్మోహన్‌ రావు తెలిపారు. క్యాష్‌బ్యాక్‌ ఎస్‌బీ కార్డ్‌ ద్వారా క్రెడిట్‌ కార్డ్‌ పోర్టిఫోలియో బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తంచేశారు. ఈ కార్డు కావాలనుకునేవారు ఎస్‌బీఐ కార్డ్‌ స్ప్రింట్‌ (SBI Card Sprint) వెబ్‌సైట్‌లో డిజిటల్‌ అప్లికేషన్‌ను పూర్తి చేసి సులువుగా పొందొచ్చని ఎస్‌బీఐ కార్డ్‌ తెలిపింది.

ఎస్‌బీఐ కార్డ్‌ ఫీచర్లివే..

  • ఆన్‌లైన్‌లో జరిపే ప్రతి లావాదేవీపై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. క్యాష్‌బ్యాక్‌పై ఎలాంటి పరిమితి ఉండదు. (బిల్లింగ్‌ సైకిల్‌లో గరిష్ఠంగా రూ.10వేలు)
  • ఆఫ్‌లైన్‌లో చేసే లావాదేవీలు, యుటిలిటీ బిల్‌ పేమెంట్స్‌పై 1 శాతం క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది.
  • బిల్లింగ్‌ స్టేట్‌మెంట్‌ జనరేట్‌ అయిన తర్వాత రెండ్రోజులకు ఎస్‌బీఐ కార్డ్‌ అకౌంట్‌లో క్యాష్‌బ్యాక్‌ క్రెడిట్‌ అవుతుంది.
  • 2023 మార్చి వరకు స్పెషల్‌ ఆఫర్‌ కింద మెంబర్‌షిప్‌ ఫ్రీ. ఆ తర్వాత కార్డు రెన్యువల్‌కు ఏడాదికి రూ.999 చెల్లించాల్సి ఉంటుంది. ఏడాదిలో రూ.2 లక్షలు మించి లావాదేవీలు చేస్తే వార్షిక ఫీజు రద్దు అవుతుంది.
  • పెట్రోల్‌ పంపుల వద్ద ఒక శాతం ఫ్యూయల్‌ సర్‌ఛార్జీ మినహాయింపు (రూ.500 నుంచి రూ.3000 మధ్య లావాదేవీలపై. ఒక బిల్లింగ్‌ సైకిల్‌లో గరిష్ఠంగా 100 రూపాయల వరకు)
  • దేశీయ విమానాశ్రయాల్లో 4 లాంజ్‌ సేవలు ఉచితంగా లభిస్తాయి. (ఒక త్రైమాసికంలో ఒకటి)
  • అద్దె చెల్లింపులు, చమురు కొనుగోళ్లు, వాలెట్లలోకి డబ్బులు లోడ్‌ చేయడం, మర్చంట్‌ ఈఎంఐలు, క్యాష్‌ అడ్వాన్సులు.. వంటి వాటిపై క్యాష్‌బ్యాక్‌ వర్తించదు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు