SBI Credit Card: ఎస్‌బీఐ క్రెడిట్‌కార్డ్ రివార్డు పాయింట్లలో కోత.. జనవరి నుంచే..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) క్రెడిట్ కార్డులు (Credit card) వాడే వారికి అలర్ట్. రివార్డు పాయింట్ల ప్రోగ్రాములో ఎస్‌బీఐ కార్డ్ (SBI card) కొన్ని మార్పులు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) క్రెడిట్ కార్డులు (Credit card) వాడే వారికి అలర్ట్. రివార్డు పాయింట్ల ప్రోగ్రాములో ఎస్‌బీఐ కార్డ్ (SBI card) కొన్ని మార్పులు చేసింది. ఆన్‌లైన్ కొనుగోళ్లపై ప్రస్తుతం ఇస్తున్న రివార్డు పాయింట్లలో (Reward points) కోత పెట్టింది. జనవరి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురానున్నట్లు తెలిపింది. ఇటీవల హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సైతం రివార్డు పాయింట్ల విషయంలో కొన్ని పరిమితులు విధించింది. ఎస్‌బీఐ సైతం ఇప్పుడు అదే బాట పట్టింది.
Also Read: HDFC క్రెడిట్‌కార్డుదారులకు అలర్ట్.. రెంట్ పేమెంట్, రివార్డు పాయింట్లపై కొత్త రూల్స్!
ప్రస్తుతం అమెజాన్ వెబ్‌సైట్‌లో సింప్లీక్లిక్, సింప్లీ అడ్వాంటేజ్ కార్డుల ద్వారా కొనుగోళ్లపై 10X రివార్డు పాయింట్లు లభించేవి. జనవరి 1 నుంచి వీటి ద్వారా కొనుగోళ్లపై 5X మాత్రమే రానున్నాయి. అపోలో 24×7, బుక్‌మై షో, క్లియర్‌ట్రిప్, ఈజీడైనర్, లెన్స్‌కార్ట్, నెట్‌మెడ్స్ ఆన్‌లైన్ కొనుగోళ్లపై మాత్రం ఎప్పటిలానే 10X రివార్డులు లభించనున్నాయని ఎస్‌బీఐ కార్డ్ తెలిపింది. అలాగే సింప్లీ క్లిక్ కార్డుహోల్డర్లకు జారీ చేసిన క్లియర్‌ట్రిప్ వోచర్లను ఇకపై ఒకే లావాదేవీకి అనుమతించనున్నారు. పైగా ఇతర ఏ ఆఫర్లతోనూ గానీ, వోచర్లతో గానీ కలిపి వినియోగించడానికి వీల్లేదని ఎస్‌బీఐ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. జనవరి 6 నుంచి ఈ రూల్ అమల్లోకి రానుందని తెలిపింది.
- ఎస్‌బీఐ నవంబర్ 15 నుంచి ఈఎంఐ లావాదేవీలపై ఉన్న ఛార్జీలను సవరించింది. గతంలో ఈఎంఐ లావాదేవీపై రూ.99గా ఉన్న ప్రాసెసింగ్ ఫీజును రూ.199కు పెంచింది. అలాగే అద్దె చెల్లింపులపై రూ.99 ఫీజుగా వసూలు చేస్తోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
NTR-Kalyan Ram: బెంగళూరు బయల్దేరిన ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్
-
India News
రూ.1.5 కోట్లకు అడిగినా.. ఆ దున్నను అమ్మేది లేదట
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Ambati Rambabu: ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదు: మంత్రి అంబటి
-
Crime News
Smita Sabharwal: పదోన్నతుల గురించి మాట్లాడేందుకే వెళ్లా.. స్మితా సభర్వాల్ ఇంట్లోకి చొరబడిన డీటీ వెల్లడి
-
World News
ఆక్సిటోసిన్ లవ్ హార్మోన్ కాదా?.. శాస్త్రవేత్తల పరిశోధనల్లో కీలక విషయాలు..