Rent with SBI Card: అద్దె చెల్లింపుపై రుసుముల పెంపు: ఎస్‌బీఐ కార్డ్స్‌

Rent with SBI Card: క్రెడిట్‌ కార్డు ఉపయోగించి అద్దె చెల్లించినప్పుడు వర్తించే రుసుమును పెంచుతున్నట్లు ఎస్‌బీఐ కార్డ్స్‌ వెల్లడించింది.

Updated : 15 Feb 2023 11:01 IST

హైదరాబాద్‌: క్రెడిట్‌ కార్డు (Credit Card) ఉపయోగించి అద్దె చెల్లించినప్పుడు వర్తించే రుసుమును పెంచుతున్నట్లు ఎస్‌బీఐ కార్డ్స్‌ (SBI Cards) వెల్లడించింది. ఇప్పటి వరకు ఈ ఛార్జీ రూ.99 (పన్నులు అదనం)గా ఉండగా, మార్చి 17 నుంచి రూ.199 (పన్నులు అదనం)కి పెంచుతున్నట్లు తెలిపింది. ఈ విషయమై వినియోగదారులకు సందేశాలను పంపిస్తోంది.  గత నవంబరులో ఎస్‌బీఐ కార్డ్స్‌ ఈ రుసుమును పెంచింది. క్రెడిట్‌ కార్డుల ద్వారా అద్దె చెల్లించేందుకు అవకాశం కల్పిస్తూనే కార్డు సంస్థలు రుసుములను విధిస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు అద్దె మొత్తంలో 1 శాతాన్ని రుసుముగా వసూలు చేస్తున్నాయి. కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ కూడా ఈనెల 15 నుంచి నుంచి అద్దె మొత్తంలో 1 శాతాన్ని రుసుమును వసూలు చేస్తామని తెలిపింది. ఎంపిక చేసిన కార్డులకు ఈ రుసుము వర్తించదు. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కూడా ఈ నెల 1 నుంచి చెల్లించిన అద్దె మొత్తంలో 1 శాతం రుసుము వసూలు చేస్తున్నట్లు వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని