DSB: డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవల‌కు ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సి, పీఎన్‌బి విధిస్తున్న ఛార్జీలు 

న‌గ‌దు డిపాజిట్‌, విత్‌డ్రా వంటి సేవ‌ల‌తో పాటు 10 ఆర్థికేత‌ర సేవ‌ల‌ను డోర్‌-స్టెప్ సేవ‌ల ద్వారా పొంద‌వ‌చ్చు. 

Updated : 12 Jan 2022 16:57 IST

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)తో పాటు ప‌లు బ్యాంకులు తమ‌ వినియోగదారులకు డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలను అందిస్తున్నాయి. పెద్ద వ‌య‌సు లేదా అనారోగ్యం కారణం చేత  స్వ‌యంగా బ్యాంకుకి వెళ్లలేని క‌స్ట‌మ‌ర్లు ఇంటి వ‌ద్దే సుర‌క్షితంగా, సుల‌భంగా ఈ సేవ‌లు పొంద‌వ‌చ్చు. న‌గ‌దు డిపాజిట్‌, విత్‌డ్రా వంటి సేవ‌ల‌తో పాటు చెక్ పికప్, చెక్ రిక్విజిషన్ స్లిప్ పికప్, ఫారం 15 హెచ్ పికప్, డ్రాఫ్ట్ డెలివరీ, లైఫ్ సర్టిఫికేట్ పికప్, కెవైసి పత్రాల పికప్ వంటి 10 ఆర్థికేత‌ర సేవ‌ల‌ను డోర్‌-స్టెప్ సేవ‌ల ద్వారా పొంద‌వ‌చ్చు. 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డోర్ స్టెప్ బ్యాంకింగ్ ఛార్జీలు..
ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్లు డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవ‌ల కోసం హోమ్ బ్రాంచ్‌కి అభ్య‌ర్థ‌న (రిజిస్ట‌ర్) చేసుకోవాలి. ఆర్థికేత‌ర లావాదేవీల‌కు రూ. 60+జీఎస్‌టీ, ఆర్థిక లావాదేవీల‌కు రూ. 100+జీఎస్టీ చొప్పున ప్ర‌తీ విజిట్‌కి బ్యాంక్ ఛార్జ్ చేస్తుంది. ఒక్కో విజిట్‌లో రోజుకి రూ. 20 వేల వ‌ర‌కు న‌గ‌దు విత్‌డ్రా, డిపాజిట్ చేయ‌వ‌చ్చు. 

పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్(పీఎన్‌బి)..
70 ఏళ్ల పైబ‌డిన సీనియ‌ర్ సిటిజ‌న్లు, వికలాంగులు, అనారోగ్యం కార‌ణంగా బ్యాంకు రాలేని ఇత‌రులు పీఎన్‌బి డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవ‌ల‌ను పొందవ‌చ్చు. పీఎన్‌బి త‌న బ్రాంచ్‌ల ద్వారా బ్యాంక్‌కి 5 కిలోమీట‌ర్ల ప‌రిధిలో ఉన్న వ్య‌క్తుల‌కు డోర్‌-స్టెప్ సేవ‌ల‌ను అందిస్తుంది. ఆర్థిక‌, ఆర్థికేత‌ర లావాదేవీలు సంబంధించి ఒక్కో విజిట్‌కి రూ.100+జీఎస్‌టి వ‌సూలు చేస్తుంది. 

హెచ్‌డీఎఫ్‌సి బ్యాంక్‌..
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, బ్యాంకు క‌స్ట‌మ‌ర్లు ఒక్కో విజిట్‌కు గ‌రిష్టంగా రూ. 25వేలు, క‌నీసం రూ. 5వేలు న‌గ‌దు విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. క్యాష్ పిక‌ప్‌, డెలివ‌రి రూ. 200+ట్యాక్స్‌, ఇత‌ర పిక‌ప్‌ల‌కు రూ. 100+ట్యాక్స్ చెల్లించాలి. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని