SBI: ఫిక్స్‌డ్‌ డిపాజిటర్లకు ఎస్‌బీఐ గుడ్‌న్యూస్‌.. వడ్డీ పెంపు

వివిధ కాలపరిమితుల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచుతూ ఎస్‌బీఐ నిర్ణయం తీసుకుంది. వీటిపై 10 నుంచి 20 బేసిస్‌ పాయింట్ల వరకు వడ్డీ పెంచింది.

Published : 15 Oct 2022 18:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ SBI) ఫిక్స్‌డ్‌ డిపాజిటర్లకు శుభవార్త చెప్పింది. రూ.2 కోట్ల లోపు డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచింది. ఈ పెంచిన వడ్డీ రేట్లు శనివారం (అక్టోబరు 15) నుంచే అమల్లోకి వచ్చాయి. రూ.2 కోట్ల లోపు అన్ని కాలపరిమితుల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 10 బేసిస్‌ పాయింట్ల నుంచి 20 బేసిస్‌ పాయింట్ల వరకు వడ్డీరేట్లను పెంచింది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఎస్‌బీఐ వడ్డీరేట్లను పెంచడం రెండు నెలల తర్వాత మళ్లీ ఇప్పుడే.

సీనియర్‌ సిటిజన్ల జమలపై కూడా 20 బేసిస్‌ పాయింట్ల వరకు వడ్డీ పెంచింది. తాజా పెంపుతో ఎస్‌బీఐలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లు (వివిధ కాలపరిమితులకు) 3 శాతం నుంచి 5.85శాతం వరకు ఉన్నాయి. ఇక సీనియర్‌ సిటిజన్ల జమలపై వడ్డీరేట్లు 3.5శాతం నుంచి 6.65శాతం వరకు ఉన్నాయి.

ఎస్‌బీఐ తాజా వడ్డీరేట్లు ఇలా..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని