Money Transfer: ఐఎంపీఎస్ న‌గ‌దు బ‌దిలీ లిమిట్ పెంచిన ఎస్‌బీఐ

 ఐఎంపీఎస్ ద్వారా ఫిబ్ర‌వ‌రి 1 నుంచి రూ. 5 ల‌క్ష‌ల వ‌ర‌కు బ‌దిలీ చేయ‌వ‌చ్చు.  

Published : 04 Jan 2022 12:40 IST

భార‌తీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ).. బ్యాంకు శాఖ‌ల వ‌ద్ద చేసే ఐఎంపీఎస్ (ఇమ్మిడియేట్ పేమెంట్ స‌ర్వీస్‌)  న‌గ‌దు బ‌దిలీ ప‌రిమితిని పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) మార్గ‌ద‌ర్శ‌కాలను అనుస‌రించి ప్ర‌స్తుతం ఉన్న రూ. 2 ల‌క్ష‌ల ప‌రిమితిని రూ. 5 ల‌క్ష‌ల‌కు పెంచుతున్న‌ట్లు తెలిపింది. ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ ప్ర‌కారం, ఐఎంపీఎస్‌ లావాదేవీల‌కు స‌రికొత్త స్లాబ్‌ను ఏర్పాటు చేసింది. రూ. 2 ల‌క్ష‌ల నుంచి రూ. 5 ల‌క్ష‌ల మ‌ధ్య చేసే న‌గ‌దు బ‌దిలీలు కొత్త స్లాబ్ కింద‌కి వ‌స్తాయి. వీటికి రూ. 20+జీఎస్‌టీ ఛార్జ్ వ‌ర్తించ‌నుంది. కొత్త రూల్స్ ఫిబ్ర‌వ‌రి 1, 2022 నుంచి  అమ‌లులోకి రానున్నాయి. 

ఎస్‌బీఐ: ఐఎంపీఎస్ బ‌దిలీలు - వ‌ర్తించే ఛార్జీలు..

ఐఎంపీఎస్‌ అంటే..
ఐఎంపీఎస్ అంటే ఇమ్మిడియేట్ పేమెంట్ స‌ర్వీస్‌(తక్షణ నగదు బదిలీల చెల్లింపు వ్యవస్థ). నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసిఐ) నిర్వ‌హిస్తుంది. ఈ విధానం ద్వారా వ్య‌క్తులు దేశీయంగా క్ష‌ణాల్లో మొబైల్‌, ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్‌, ఏటీఎమ్‌, ఎస్ఎమ్ఎస్ వంటి వివిధ ఛానాళ్ల ద్వారా బ్యాంకులు, ఆర్‌బీఐ అధీకృత‌ పీపీఐ(ప్రీపెయిడ్ పేమెంట్ ఇస్ట్రుమెంట్స్‌)ల్లో ఇంట‌ర్ బ్యాంక్ ఎల‌క్ట్రానిక్‌ ఫండ్ ట్రాన్స్‌ఫ‌ర్ స‌ర్వీసుల‌ను సెల‌వు రోజుల్లోనూ 24/7 యాక్సిస్ చేయ‌వ‌చ్చు. ప్ర‌స్తుతం ఐఎంపీఎస్‌లో బ్యాంకులు, పీపీఐతో స‌హా మొత్తంగా 639 స‌భ్యులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని