FD Rates: మరోసారి డిపాజిట్ రేట్లను పెంచిన ఎస్‌బీఐ

పెరిగిన డిపాజిట్‌ రేట్లు అక్టోబరు 22, 2022 నుంచి అమల్లోకి వస్తాయి.

Updated : 22 Oct 2022 13:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎస్‌బీఐ రిటైల్‌ టర్మ్‌ డిపాజిట్‌ వడ్డీ రేట్లను 50 నుంచి 80 బేసిస్‌ పాయింట్ల వరకు పెంచింది. 7 రోజుల నుంచి 45 రోజుల ఎఫ్‌డీలపై 3% కనిష్ఠ వడ్డీ లభిస్తుంది. 46 రోజుల నుంచి 1 ఏడాది కంటే తక్కువ కాలవ్యవధి ఎఫ్‌డీలపై 4.50% నుంచి 5.50% వరకు బ్యాంకు అందిస్తుంది. 1 ఏడాది నుంచి 2 ఏళ్ల లోపు కాలవ్యవధి ఎఫ్‌డీలపై 6.10% వడ్డీ పొందొచ్చు. 2 ఏళ్ల నుంచి 5 సంవత్సరాల కాల వ్యవధి ఎఫ్‌డీలపై 6.25% వరకు వడ్డీ లభిస్తుంది.

సీనియర్‌ సిటిజన్లు 7 రోజుల నుంచి 45 రోజుల వ్యవధికి 3.50% కనిష్ఠ వడ్డీ రేటును పొందుతారు. 5-10 సంవత్సరాల ఎఫ్‌డీలపై 6.90% వరకు గరిష్ఠ వడ్డీ రేటును పొందుతారు. పెరిగిన డిపాజిట్‌ రేట్లు అక్టోబరు 22 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ వడ్డీ రేట్లు రూ. 2 కోట్ల డిపాజిట్లకు వర్తిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని