Q1 ఫలితాలు.. SBI లాభం తగ్గింది

SBI Q1 results: జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో SBI నికర లాభం క్షీణించింది.

Published : 06 Aug 2022 15:16 IST

దిల్లీ: ప్రభుత్వ రంగానికి చెందిన అతిపెద్ద బ్యాంక్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్‌ నికర లాభం స్టాండలోన్‌ పద్ధతిన రూ.6068 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.6504 కోట్లతో పోలిస్తే 7 శాతం తగ్గడం గమనార్హం.

బ్యాంక్‌ మొత్తం ఆదాయం సైతం స్వల్పంగా క్షీణించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ.77,347.17 కోట్లుగా నమోదు కాగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 74,998.57 కోట్లకు చేరినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఎస్‌బీఐ పేర్కొంది. స్థూల నిరర్థక ఆస్తుల (NPA) నిష్పత్తి 5.32 శాతం నుంచి 3.91 శాతానికి తగ్గగా.. స్థూల ఎన్‌పీఏలు సైతం 1.7 శాతం నుంచి 1.02 శాతానికి చేరినట్లు బ్యాంక్‌ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు