SBI ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. పెన్షనర్ల కోసం కొత్త సర్వీస్‌

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా పెన్షన్‌ పొందుతున్న పెన్షనర్లు..ఇకపై పెన్షన్‌ స్లిప్‌ వాట్సాప్‌ ద్వారా పొందవచ్చు.

Updated : 19 Nov 2022 17:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సీనియర్‌ సిటిజన్లకు గుడ్‌న్యూస్‌. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (SBI) కొత్త సర్వీసును లాంచ్‌ చేసింది. పెన్షన్‌ స్లిప్‌ను పొందేందుకు ఇకపై బ్యాంకు శాఖకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి నుంచే పొందే సదుపాయం తీసుకొచ్చింది. ఎలాంటి అవాంతరాలూ లేకుండా ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా వాట్సాప్‌ ద్వారా పొందే వీలు కల్పిస్తోంది.

ఈ సేవలు పొందేందుకు ఖాతాదారులు బ్యాంకు వద్ద రిజిస్టర్‌ చేసుకున్న మొబైల్‌ నంబరు నుంచి +91 9022690226 కి ‘హాయ్‌’ అని వాట్సాప్‌ సందేశం పంపిస్తే సరిపోతుంది. వాట్సాప్‌ ద్వారా ఖాతాదారులు పెన్షన్‌ స్లిప్‌ మాత్రమే కాకుండా మినీ స్టేట్‌మెంట్‌, బ్యాలెన్స్‌ ఎంక్వైరీ వంటి సేవలనూ పొందొచ్చు. ఎస్‌బీఐ అందించే వాట్సాప్‌ సేవలను పొందేందుకు కస్టమర్లు ముందుగా రిజిస్టర్‌ చేసుకోవాలి. ఒకవేళ చేసుకోకపోయి ఉంటే.. మీ రిజిస్టర్డ్ మొబైల్‌ నంబర్‌ నుంచి WAREG అని టైప్‌ చేసి స్పేస్‌ ఇచ్చి మీ ఖాతా నంబర్‌ను టైప్‌ చేసి 72089 33148 నంబర్‌కు మెసేజ్‌ చేయాలి. ఇది, బ్యాంకు వద్ద రిజిస్టర్‌ అయ్యి ఉన్న మొబైల్‌ నంబర్‌ నుంచే పంపించాలి. కాబట్టి, బ్యాంకు వద్ద ముందుగా మీ నంబర్‌ను అప్‌డేట్‌ చేసుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని