SBI Tax Saving Scheme: ఎస్‌బీఐ టర్మ్‌ డిపాజిట్‌తో పన్ను ఆదా

బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ ప్రత్యేకంగా పన్ను ఆదా కోసం టర్మ్‌ డిపాజిట్‌ పొదపు పథకాలను అందిస్తోంది. వాటి ఫీచర్లు, షరతులు ఎలా ఉన్నాయో చూద్దాం.....

Updated : 18 Mar 2022 12:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పన్ను ఆదాకు విపణిలో అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో టర్మ్‌ డిపాజిట్లు ఒకటి. బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ ప్రత్యేకంగా పన్ను ఆదా కోసం టర్మ్‌ డిపాజిట్‌ పొదపు పథకాలను అందిస్తోంది. వాటి ఫీచర్లు, షరతులు ఎలా ఉన్నాయో చూద్దాం..

ఇవీ వివరాలు..

* ఎస్‌బీఐ ఖాతాదారులై ఉండాలి. టర్మ్‌ డిపాజిట్‌ లేదా స్పెషల్‌ టర్మ్‌ డిపాజిట్‌ ఖాతాను తెరవాలి.

* కనిష్ఠంగా ఐదేళ్లు.. గరిష్ఠంగా పదేళ్లకు సొమ్ము జమ చేయాలి.

* రూ.1,000 కనీస మొత్తాన్ని జమ చేయాల్సి ఉంటుంది.

* గరిష్ఠంగా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు జమ చేసే అవకాశం ఉంది.

* ‘మూలం వద్ద పన్ను’(టీడీఎస్‌) వర్తిస్తుంది. కానీ, దీని నుంచి మినహాయింపునకు 15జీ/15హెచ్‌ ఫారం సమర్పించి లబ్ధి పొందొచ్చు.

* సెక్షన్‌ 80సీ కింద ఆదాయ పన్ను మినహాయింపు ప్రయోజనాలు పొందొచ్చు.

* ఒకవేళ ఖాతాదారుడు మరణిస్తే నామినీ లేదా చట్టబద్ధ వారసులు కాలపరిమితికి ముందే జమ చేసిన మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు.

* ఖాతాను ఇతర శాఖలకు మార్చుకునే వెసులుబాటు ఉంటుంది.

అర్హత..

* భారత్‌లో నివాసమున్నవారై ఉండాలి. హిందూ అవిభాజ్య కుటుంబానికి చెందిన ప్రతినిధి కూడా టర్మ్‌ డిపాజిట్‌ చేయొచ్చు.

* పాన్‌కార్డు తప్పనిసరి.

* ఇద్దరు వయోజనులు లేదా ఒక వయోజనుడు ఒక మైనర్‌ కలిసి జాయింట్‌ అకౌంట్‌ తీసుకోవచ్చు.

షరతులు..

* ఐదేళ్ల లాకిన్‌ పీరియడ్‌ ఉంటుంది. ఈ సమయంలో ఎలాంటి రుణం తీసుకోవడానికి అవకాశం ఉండదు.

* ఐదేళ్లలోపు నగదు ఉపసంహరించుకోవడానికి అవకాశం లభించదు.

* ఐదేళ్ల తర్వాత టర్మ్‌ డిపాజిట్‌ నియమ నిబంధనల ప్రకారం.. ముందస్తు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది.

* జాయింట్‌ ఖాతా తెరిచిన ఇద్దరిలో ఏ ఒక్కరు మరణించినా.. మరొకరు కాలపరిమితి ముగియడానికి ముందే సొమ్మును ఉపసంహరించుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని