SBI Personal Loan: ఆన్‌లైన్‌లో సులభంగా ఎస్‌బీఐ పర్సనల్‌ లోన్‌!

ప్ర‌ముఖ ప్ర‌భుత్వ రంగ బ్యాంకు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) వ్య‌క్తిగ‌త రుణాల‌పై ప్ర‌త్యేక రాయితీని అందించ‌డ‌మే కాకుండా వేగంగా వ్య‌క్తిగ‌త రుణాన్ని అందిస్తోంది.

Updated : 10 Dec 2021 14:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్ర‌ముఖ ప్ర‌భుత్వ రంగ బ్యాంకు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) వ్య‌క్తిగ‌త రుణాల‌పై ప్ర‌త్యేక రాయితీని అందించ‌డ‌మే కాకుండా వేగంగా వ్య‌క్తిగ‌త రుణాన్ని అందిస్తోంది. వ్య‌క్తిగ‌త రుణాన్ని ఆన్‌లైన్‌లో చాలా వేగంగా పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. రుణం పొంద‌డానికి ఎలాంటి భౌతిక డాక్యుమెంటేష‌న్ అవ‌స‌రం లేదు. బ్యాంకును సంద‌ర్శించ‌న‌క్క‌ర్లేదు. అత్య‌వ‌స‌రంగా న‌గ‌దు అవ‌స‌ర‌మైన స్టేట్ బ్యాంక్ వినియోగ‌దారులు ఈ అవ‌కాశాన్ని ఉప‌యోగించుకుని ప్రీ-అప్రూవ్డ్ వ్య‌క్తిగ‌త రుణాన్ని పొందొచ్చు. ఈ సౌక‌ర్యం బ్యాంకు వినియోగ‌దారుల‌కు అన్ని రోజులూ 24 గంట‌లూ అందుబాటులో ఉంటుంది.

రుణ అర్హ‌త‌ను  కింది విధంగా చెక్ చేసుకోవ‌చ్చు..

ఎస్‌బీఐ వినియోగ‌దారులు  PAPL<స్పేస్‌>< చివ‌రి 4  అంకెల ఎస్‌బీఐ పొదుపు ఖాతా నంబ‌ర్‌>> అని టైప్ చేసి 567676 నంబర్‌కు ఎస్సెమ్మెస్‌ చేసి, వారి రుణ అర్హ‌త‌ను త‌నిఖీ చేసుకోవ‌చ్చు.

వ‌డ్డీ రేటు: క‌నిష్ఠంగా వ‌డ్డీరేటు 9.60% నుంచి ప్రారంభ‌మ‌వుతుంది.

ప్రాసెసింగ్ ఫీజు: పండుగ ఆఫ‌ర్ సంద‌ర్భంగా 31 జ‌న‌వ‌రి 2022 వ‌ర‌కు ప్రాసెసింగ్ ఛార్జీల్లో 100% మిన‌హాయింపు ఉంది.

రుణాన్ని పొంద‌డానికి 4 ద‌శ‌లు ఇవీ..

1. ఎస్‌బీఐ యోనో యాప్‌లోకి లాగిన్ అవ్వండి.

2. అవైల్ నౌ బ‌ట‌న్‌పై క్లిక్ చేయండి.

3. లోన్ మొత్తం, కాల‌వ్య‌వ‌ధిని ఎంచుకోండి.

4. బ్యాంక్ ఖాతాకు అనుసంధానం చేసిన మొబైల్‌ నంబర్‌లో అందుకున్న ఓటీపీని న‌మోదు చేయండి.

కేవ‌లం 4 క్లిక్కుల్లో వ్యక్తిగ‌త రుణానికి సంబంధించి త‌క్ష‌ణ ప్రాసెసింగ్ జ‌రుగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని