SBI: ఈ ఆర్థిక సంవత్సరంలో 400 కొత్త శాఖలు: ఎస్‌బీఐ

SBI: అవకాశాలున్న ప్రాంతాలను గుర్తించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 400 కొత్త ఎస్‌బీఐ శాఖలను ఏర్పాటు చేస్తామని ఛైర్మన్‌ దినేశ్‌ ఖారా వెల్లడించారు.

Published : 23 Jun 2024 18:26 IST

SBI | దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశంలో 400 కొత్త శాఖలను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు ‘స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా (SBI)’ ఛైర్మన్‌ దినేశ్‌ ఖారా వెల్లడించారు. గత సంవత్సరం 137 కొత్త శాఖలు తెరిచినట్లు తెలిపారు. వీటిలో 59 గ్రామీణ బ్రాంచీలు ఉన్నట్లు వెల్లడించారు.

డిజిటల్‌ లావాదేవీలు పెరుగుతున్న తరుణంలో కొత్త శాఖల ఏర్పాటు అవసరమేంటని కొందరు ప్రశ్నిస్తున్నట్లు ఖారా తెలిపారు. బ్యాంకింగ్‌లో కొత్త విభాగాలు పుట్టుకొస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ బ్రాంచీలు అవసరమని ఆయన వివరించారు. సూచనాత్మక, సంపద సృష్టి సంబంధిత సేవలను కేవలం బ్రాంచీల ద్వారానే అందించగలమని తెలిపారు. ఈ నేపథ్యంలో అవకాశాలున్న ప్రాంతాలను గుర్తించి కొత్త వాటిని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. 2024 మార్చి నాటికి ఎస్‌బీఐకి (SBI) 22,542 బ్రాంచీలు ఉన్నాయి.

అదానీ వేతనం రూ.9.26 కోట్లు..సొంత ఉద్యోగుల కంటే తక్కువట!

అనుబంధ సంస్థల కార్యకలాపాలను మరింత పెంచడం ద్వారా వాటి విలువ ఎగబాకుతుందని ఖారా వెల్లడించారు. తద్వారా ఎస్‌బీఐ (SBI) లాభాలూ మెరుగుపడతాయన్నారు. ఆ తర్వాతే వాటి నగదీకరణపై ఆలోచిస్తామని వివరించారు. క్యాపిటల్‌ మార్కెట్ల ద్వారా దాని నగదీకరణను చేపడతామని తెలిపారు. ఎస్‌బీఐ జనరల్‌, ఎస్‌బీఐ పేమెంట్‌ సర్వీసెస్‌ విషయంలో ఆ మార్గాన్ని అనుసరించే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని