SBI Quarterly Results: ఎస్‌బీఐ లాభాల్లో 62% వృద్ధి

ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ‘స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ)’ రెండో త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. స్టాండలోన్‌ నికర లాభాల్లో 62 శాతం వృద్ధి నమోదు చేసింది.....

Published : 05 Feb 2022 16:19 IST

దిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ‘స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ)’ రెండో త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. స్టాండలోన్‌ నికర లాభాల్లో 62 శాతం వృద్ధి నమోదు చేసింది. అక్టోబరు - డిసెంబరు త్రైమాసికంలో రూ.8,432  కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో బ్యాంకు నికర లాభం రూ.5,196 కోట్లుగా ఉంది. ఇక ఎస్‌బీఐ మొత్తం ఏకీకృత ఆదాయం క్రితం ఏడాది నమోదైన రూ.75,981 కోట్ల నుంచి రూ.78,352 కోట్లకు పెరిగింది. ఇక సమీక్షిస్తున్న త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన కూడా బ్యాంకు లాభం 51 శాతం పెరిగి రూ.9,692 కోట్లకు చేరింది. ఈ త్రైమాసికంలో కొత్త నిరర్థక ఆస్తులు 4.5 శాతంగా నమోదుకాగా.. మొత్తంగా బ్యాంకు నికర నిరర్థక ఆస్తులు స్వల్పంగా పెరిగి 1.34 శాతానికి చేరాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని