MCLR: రుణ రేట్లను సవరించిన SBI

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.. MCLRను ఎంపిక చేసిన కొన్ని కాలవ్యవధులకు 10 బేసిస్‌ పాయింట్ల వరకు పెంచింది.

Published : 15 Jun 2024 19:36 IST

దిల్లీ: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) ఎంపిక చేసిన కాలవ్యవధులకు మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్ ఫండింగ్ లెండింగ్ రేటు  (MCLR)ను 10 బేసిస్‌ పాయింట్ల వరకు పెంచింది. బ్యాంకు వెబ్‌సైట్‌ ప్రకారం ఓవర్‌నైట్‌ MCLR ఇప్పుడు 8% నుంచి 8.10%కు చేరుకుంది. ఒక సంవత్సరం MCLR.. 8.65% నుంచి 8.75%కు పెరిగింది. ఈ పెరిగిన MCLR రేట్లు 2024 జూన్‌ 15 నుంచి వర్తిస్తాయి. ఎస్‌బీఐ ఆటో రుణాలు ఒక సంవత్సరం ఎంసీఎల్‌ఆర్‌కు, వ్యక్తిగత రుణాలు 2 సంవత్సరాల ఎంసీఎల్‌ఆర్‌కు లింక్‌ చేసి ఉన్నాయి. ఒక నిర్దిష్ట రుణం కోసం ఆర్థిక సంస్థ విధించే కనీస వడ్డీ రేటును MCLR అంటారు. సాధారణంగా ఇది రుణానికి సంబంధించిన అతి తక్కువ వడ్డీ రేటును సూచిస్తుంది. MCLRను నిర్ణయించేటప్పుడు.. డిపాజిట్‌ రేట్లు, రెపో రేట్లు, ఖర్చులు, నగదు నిల్వల నిష్పత్తిని నిర్వహించడానికి అయ్యే ఖర్చుతో సహా అనేక అంశాలను బ్యాంకులు పరిగణనలోకి తీసుకుంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని