SBI: 20,000 చిన్న సంస్థలకు రుణాల మంజూరు: ఎస్‌బీఐ

డిసెంబరులో ప్రారంభమైన డిజిటల్‌ రుణాల ప్రయోగాత్మక ప్రాజెక్ట్‌ భాగంగా చిన్న సంస్థలకు రూ.10-50 లక్షల వరకు దాదాపు 20,000 రుణాలు మంజూరు చేసినట్లు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సురేంద్ర రాణా తెలిపారు.

Published : 15 Jun 2024 02:39 IST

ముంబయి: డిసెంబరులో ప్రారంభమైన డిజిటల్‌ రుణాల ప్రయోగాత్మక ప్రాజెక్ట్‌ భాగంగా చిన్న సంస్థలకు రూ.10-50 లక్షల వరకు దాదాపు 20,000 రుణాలు మంజూరు చేసినట్లు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సురేంద్ర రాణా తెలిపారు. వినియోగదారులు ఇంటి నుంచే ఈ రుణాలు పొందారని, ఈ ప్రాజెక్ట్‌ ఫలితాలు సంతృప్తికరంగా ఉండటంతో రుణ మొత్తాలను రూ.5 కోట్లకు పెంచనున్నట్లు వెల్లడించారు. అయిదు రోజుల్లోగా మంజూరు చేసిన మొత్తాన్ని రుణగ్రహీతలకు అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వచ్చే అయిదేళ్లలో బ్యాంక్‌ లాభాలకు, వృద్ధికి చిన్న సంస్థల రుణాలు కీలకం కానున్నాయని బ్యాంక్‌ ఇటీవల వెల్లడించింది. చిన్న సంస్థల రుణ అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వాలు, లాభాపేక్ష రహిత సంస్థలు, ఫిన్‌టెక్‌ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నట్లు సురేంద్ర వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని