SBI down: దేశంలో స్తంభించిన ఎస్‌బీఐ సేవలు.. వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు!

దేశవ్యాప్తంగా ఎస్‌బీఐ సేవలకు (SBI down) అంతరాయం ఏర్పడింది. మధ్యాహ్నం నుంచి ఎస్‌బీఐ సేవలు పూర్తిగా స్తంభించాయి.

Updated : 30 Jun 2022 17:31 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా ఎస్‌బీఐ సేవలకు (SBI down) అంతరాయం ఏర్పడింది. మధ్యాహ్నం నుంచి ఎస్‌బీఐ సేవలు పూర్తిగా స్తంభించాయి. దీంతో యూజర్లు సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదు చేస్తున్నారు. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌, ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తమ ఫిర్యాదుల్లో పేర్కొంటున్నారు. యూపీఐ విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. ఏటీఎం కేంద్రాల్లో నగదు ఉపసంహరణలు కూడా జరగడం లేదని పేర్కొంటున్నారు. 

మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ విధంగా ఫిర్యాదులు అందుతున్నట్లు డౌన్‌ డిటెక్టర్‌ వెబ్‌సైట్‌ పేర్కొంది. అయితే, సేవల పునరుద్ధరణపై ఎస్‌బీఐ స్పందించలేదు. యూజర్లు యోనో యాప్‌ తెరవడానికి ప్రయత్నించినప్పుడు మెయింటెన్స్‌ కారణంగా సేవలకు అంతరాయం ఏర్పడుతున్నట్లు ఓ మెసేజ్‌ దర్శనమిస్తోంది. నెలాఖరులో జీతాలు పడే వేళ సేవల్లో అంతరాయం తలెత్తడంపై ఖాతాదారులు పెదవి విరుస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని