IPO listing: 3 రోజులకే ఐపీఓ లిస్టింగ్‌.. సెబీ ప్రతిపాదన

ఐపీఓ లిస్టింగ్‌ టైమ్‌ను 6 రోజుల నుంచి 3 రోజులకు కుదించాలని సెబీ ప్రతిపాదించింది. దీనిపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకోనుంది. 

Published : 20 May 2023 19:34 IST

దిల్లీ: ఐపీఓలకు (IPO) సంబంధించి మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) కీలక ప్రతిపాదనతో ముందుకొచ్చింది. ఐపీఓల లిస్టింగ్‌ సమయాన్ని కుదించాలని నిర్ణయించింసబ్‌స్క్రిప్షన్‌ పూర్తయ్యాక స్టాక్ ఎక్స్ది. ఐపీఓ ఛేంజీల్లో లిస్టింగ్‌కు కావడానికి ప్రస్తుతం ఆరు రోజులుగా ఉన్న గడువును.. 3 రోజులకు కుదించేందుకు ప్రతిపాదించింది. దీనివల్ల అటు ఐపీఓకు వచ్చిన వారికి, మదుపరులకు సైతం మేలు చేకూరుతుందని అభిప్రాయపడింది.

లిస్టింగ్‌ సమయాన్ని తగ్గించడం వల్ల సమీకరించిన మొత్తాన్ని కంపెనీలు తమ వ్యాపార అవసరాలకు వినియోగించడం వీలు పడుతుందని సెబీ తెలిపింది. అదే విధంగా ఇన్వెస్టర్లకు సైతం తమ పెట్టుబడులపై షేర్లను, లిక్విడిటీని త్వరితగతిన పొందేందుకు వీలు పండుతుందని తన సంప్రదింపుల పత్రంలో పేర్కొంది. లిస్టింగ్‌ సమయాన్ని టి+6 నుంచి టి+3కి తగ్గించే ఈ అంశంపై జూన్‌ 3 వరకు ప్రజల నుంచి సెబీ అభిప్రాయాలు తీసుకోనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని