SEBI: ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం.. 46 సంస్థలపై సెబీ కొరడా!
స్టాక్ మార్కెట్ (Stock Market)లో కొన్ని కంపెనీల షేర్లలో పెట్టుబడి పెట్టేలా ఇన్వెస్టర్లను (Investors) ప్రోత్సహించే విధంగా యూట్యూబ్ (YouTube)లో వీడియోలు ప్రసారం చేస్తున్న 46 సంస్థలపై సెబీ (SEBI) నిషేధం విధించింది.
ముంబయి: స్టాక్ మార్కెట్ (Stock Market)కు సంబంధించి అసత్య వార్తలను ప్రసారం చేస్తూ యూజర్లను మోసం చేస్తున్న 46 సంస్థలపై సెబీ (SEBI) నిషేధం విధించింది. ఈ సంస్థలు తమ యూట్యూబ్ (YouTube) ఛానెళ్ల ద్వారా కొన్ని కంపెనీల షేర్లు కొనేలా పెట్టుబడిదారులను (Investors) ప్రేరిపిస్తున్నాయని ఆరోపించింది. ఈ సంస్థలు యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా ప్రసారం చేసే కార్యక్రమాలపై ఇన్వెస్టర్ల నుంచి ఫిర్యాదులు రావడంతో సెబీ విచారణ చేపట్టింది. గతేడాది కాలంగా వీటి ప్రసారాలపై సమగ్ర విచారణ జరిపిన సెబీ, ఇకపై ఆ సంస్థలు స్టాక్‌మార్కెట్‌కు సంబంధించి ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకుండా నిషేధం విధించింది.
‘‘స్టాక్ మార్కెట్‌కు సంబంధించి కొన్ని సంస్థలు తప్పుడు సమాచారంతో యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా అసత్య వార్తలను ప్రసారం చేస్తున్నాయి. ఈ ప్రసారాలు ఇన్వెస్టర్లను కొన్ని కంపెనీల షేర్లు కొనేలా ప్రోత్సహిస్తున్నాయి. దీనివల్ల సదరు స్టాక్ ధరల్లో అనూహ్యంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ వీడియోలు ఎక్కువ మంది చూసేందుకు ఆయా సంస్థలు పెయిడ్ మార్కెటింగ్ క్యాంపెయిన్ సైతం నిర్వహిస్తున్నాయి. ఒక కంపెనీలో పెట్టుబడిదారుల సంఖ్య 2,167 మంది ఉండగా.. ఒక త్రైమాసికంలో వారి సంఖ్య 55,343కు పెరిగింది. మరో సంస్థలో 517 నుంచి 20,009కి పెరిగింది. ఈ తీరు నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. ఇది పూర్తిగా ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించడమే’’అని సెబీ ఒక ప్రకటనలో తెలిపింది.
సెబీ నిర్ణయంపై జిరోధా (Zerodha) సీఈవో నితిన్ కామత్ స్పందించారు. ‘‘ఇటీవలి కాలంలో స్టాక్‌మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య పెరిగింది. వారిలో చాలా మంది మార్కెట్‌పై అవగాహనలేని వారే ఉంటున్నారు. అటువంటి వారు ఈ యూట్యూబ్ ఛానెళ్ల ప్రసారాలతో మోసపోయే ప్రమాదం ఉంది. సెబీ వాటిపై నిషేధం విధించడం సరైన చర్య. మార్కెట్లో ఉండే కొంత మంది వ్యక్తులు ముందుగా అందించే సమాచారంతో చేసే ప్రసారాలు మార్కెట్ ప్రతిష్టకు భంగం కలిగిస్తాయి’’ అని అన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా స్టాక్ మార్కెట్ వ్యవహారాలకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో జరిగే ప్రసారాలను గుర్తించేందుకు సెబీ గతేడాది సెప్టెంబరులో కొత్తగా వెబ్ ఇంటెలిజెన్స్ (Web Intelligence) టూల్‌ను ఏర్పాటు చేసింది. ఇది ఎప్పటికప్పుడు స్టాక్ మార్కెట్ గురించి జరిగే ప్రసారాలను విశ్లేషిస్తుంది. సెబీ నిషేధం విధించిన సంస్థలు నిర్వహించే యూట్యూబ్ ఛానెళ్లకు బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ (Arshad Warsi), ఆయన భార్య ప్రమోటర్లుగా వ్యవహిరిస్తున్నారు. దీని ద్వారా అర్షద్, ఆయన భార్య నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి పొందారని సెబీ ఆరోపించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
తిరుమలలో బ్రేక్ దర్శనం, గదుల బుకింగ్‌కు ‘పే లింక్’ సందేశాలతో నగదు చెల్లింపు!
-
విశాఖలో పిడుగు పాటు.. వీడియో వైరల్
-
ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని ఎంబీఏ విద్యార్థిని బలవన్మరణం
-
రావణుడి అత్తవారింట రామాలయం.. 35 ఏళ్లుగా తిరిగిచూడని భక్తులు
-
Bandaru Satyanarayana: మాజీ మంత్రి బండారు నివాసం వద్ద అర్ధరాత్రి భారీగా పోలీసుల మోహరింపు
-
సముద్రంలో 36 గంటలు.. గణపతి విగ్రహ చెక్కబల్లే ఆధారంగా..