Sebi: షేర్ల బై బ్యాక్‌పై సెబీ కీలక నిర్ణయం.. దశలవారీగా స్వస్తి

Sebi on share buyback: స్టాక్‌ ఎక్స్ఛేంజీల ద్వారా షేర్ల బైబ్యాక్‌ను చేపట్టే విధానానికి స్వస్తి పలకాలని సెబీ బోర్డు నిర్ణయించింది.

Updated : 20 Dec 2022 20:56 IST

ముంబయి: షేర్ల బైబ్యాక్‌ విషయంలో మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ (Sebi) కీలక నిర్ణయం తీసుకుంది. స్టాక్‌ ఎక్స్ఛేంజీ మార్గంలో కంపెనీలు చేపట్టే షేర్ల బై బ్యాక్‌ విధానానికి  దశలవారీగా స్వస్తి పలకాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న మెకానిజంలో లోపాలు ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. సెబీ బోర్డు సమావేశం అనంతరం ఈ విషయాన్ని సెబీ ఛైర్‌పర్సన్‌ మదాబీ పురీ బచ్‌ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. హెచ్‌డీఎఫ్‌సీ వైస్‌ ఛైర్మన్‌, సీఈఓ కేకి మిస్త్రీ నేతృత్వంలోని సెబీ కమిటీ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. 

ఇకపై కేవలం టెండర్‌ ఆఫర్‌ రూట్‌లో మాత్రమే బైబ్యాక్‌కు అనుమతివ్వనున్నట్లు సెబీ ఛైర్‌పర్సన్‌ తెలిపారు. స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో షేర్ల బైబ్యాక్‌కు వేరే విండో ఏర్పాటు చేయాలని సెబీ బోర్డు నిర్ణయం తీసుకుందని తెలిపారు. అలాగే టెండర్‌ ఆఫర్‌ మార్గంలో షేర్ల బైబ్యాక్‌ పూర్తి చేయడానికి గడువును 18 రోజులకు తగ్గించాలని ఇదే సమావేశంలో నిర్ణయించారు. రికార్డు డేట్‌కు ఒక్క రోజు ముందు కూడా బైబ్యాక్‌ ధరను సవరించేందుకు సైతం బోర్డు ఆమోదం తెలిపిందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని