Income Tax: సెక్షన్ 80సి కిందకి వచ్చే పెట్టుబడులు ఏవి?
ఇంటర్నెట్ డెస్క్: ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80సి వేతన జీవులకు చాలా ముఖ్యమైనది. జీతం ద్వారా ఆదాయం పొందుతున్న ఉద్యోగులు పాత పన్ను విధానంలో రిటర్నులు దాఖలు చేస్తుంటే.. ఈ సెక్షన్ ద్వారా రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఉద్యోగులు తాము చేసే పన్ను ఆదా పెట్టుబడులను అనుసరించి ఈ మినహాయింపు వర్తిస్తుంది. సెక్షన్ 80సి కిందకి వచ్చే పెట్టుబడి మార్గాలు, వాటి ద్వారా వచ్చే ఆదాయం, రిస్క్ స్థాయిలను ఇప్పుడు తెలుసుకుందాం.
పన్ను ఆదా ఫిక్స్డ్ డిపాజిట్లు..
పన్ను ఆదా ఫిక్స్డ్ డిపాజిట్లు సాధారణ ఫిక్స్డ్ డిపాజిట్ల మాదిరిగానే పనిచేస్తాయి. అయితే వీటికి 5 ఏళ్ల లాక్ ఇన్ పిరియడ్ ఉంటుంది.
అర్హత: భారత దేశ నివాసులైన వ్యక్తులు ఈ ఖాతాను తెరవచ్చు.
లిక్విడిటీ: ఐదేళ్ల లాక్-ఇన్ పిరియడ్ ఉంటుంది.
వడ్డీ రేటు: వడ్డీరేటు బ్యాంకును బట్టి మారుతూ ఉంటుంది. వివిధ బ్యాంకులు పన్ను ఆదా పెట్టుబడులపై 5.50 శాతం నుంచి 7.75 శాతం మధ్య వడ్డీ రేటును అందిస్తున్నాయి.
రిస్క్: నష్ట భయం ఉండదు.
పెట్టుబడుల పరిమితి: కనీసం రూ. 1000 నుంచి మొదలుపెట్టి ఎంతైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేయవచ్చు.
పన్నులు: వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది.
పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (పీపీఎఫ్)..
పీపీఎఫ్ అనేది ప్రభుత్వ హామీతో వచ్చే పెట్టుబడి పథకం. దీర్ఘకాల ప్రయోజనాల కోసం ఈ పథకంలో పెట్టుబడులు పెట్టవచ్చు.
అర్హత: భారతీయ నివాసులైన వ్యక్తులు (ఉద్యోగులు, ఇతరులు) ఈ ఖాతాను తెరవచ్చు. అయితే హిందూ అవిభాజ్య కుటుంబ సభ్యులు ఈ ఖాతాను తెరిచే వీలులేదు.
లిక్విడిటీ: 15 సంవత్సరాల లాక్-ఇన్ పిరియడ్ ఉంటుంది. మెచ్యూరిటీ తర్వాత కూడా 5 ఏళ్ల చొప్పున ఖాతాను పొడిగించుకోవచ్చు. ఖాతా తెరిచిన 7వ సంవత్సరం నుంచి పాక్షిక విత్‌డ్రాలను అనుమతిస్తారు.
వడ్డీ రేటు: ప్రస్తుత వార్షిక వడ్డీ రేటు 7.10 శాతం
రిస్క్: నష్టభయం ఉండదు.
పెట్టుబడులు పరిమితి: ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 500, గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
పన్నులు: వడ్డీ ఆదాయంపై పన్ను వర్తించదు.
జాతీయ పొదుపు పత్రాలు..
అర్హత: భారతీయ నివాసులైన వ్యక్తులు ఇందులో పెట్టుబడులు పెట్టవచ్చు.
లిక్విడిటీ: 5 సంవత్సరాల లాక్-ఇన్ పిరియడ్ ఉంటుంది.
వడ్డీ రేటు: ప్రస్తుత వార్షిక వడ్డీ రేటు 6.80శాతం
రిస్క్: నష్టభయం తక్కువగానే ఉంటుంది.
పెట్టుబడులు పరిమితి: కనీసం రూ. 100తో మొదలుపెట్టి ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు.
పన్నులు: వడ్డీ ఆదాయాన్ని ఇతర మార్గాల నుంచి వచ్చే ఆదాయంగా చూపించాల్సి ఉంటుంది. పెట్టుబడి పై సెక్షన్ 80సి కింద మినహాయింపు పొందవచ్చు.
సుకన్య సమృద్ధి యోజన..
అర్హత: ఇది ఆడపిల్లల కోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకం. 10 సంవత్సరాలలోపు వయసున్న ఆడపిల్లల తల్లిదండ్రులు, తమ పాప భవిష్యత్తు కోసం ఇందులో పెట్టుబడులు పెట్టవచ్చు.
లిక్విడిటీ: ఇందులో 21 సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది. అయితే పాపకు 18 సంవత్సరాల వచ్చిన తర్వాత ఉన్నత చదువుల కోసం పాక్షిక విత్‌డ్రాలను అనుమితిస్తారు. వివాహం తర్వాత పూర్తిగా విత్‌డ్రా చేసుకోవచ్చు.
వడ్డీ రేటు: ప్రస్తుత వార్షిక వడ్డీ రేటు 7.60 శాతం
రిస్క్: నష్టభయం తక్కువగా ఉంటుంది.
పెట్టుబడులు పరిమితి: ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 250, గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
పన్నులు: పెట్టుబడులు, వడ్డీ ఆదాయం, మెచ్యూరిటీ మొత్తంపై పూర్తి పన్ను మినహాయింపు పొందవచ్చు.
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్..
అర్హత: 60 ఏళ్లు దాటిన పెద్దలు, 55 సంవత్సరాల వయసులో వాలెంటరీ రిటైర్మెంట్ తీసుకున్నవారు ఈ పథకంలో పెట్టుబడులు పెట్టవచ్చు.
లిక్విడిటీ: 5 సంవత్సరాల లాక్-ఇన్ పిరియడ్ ఉంటుంది. మెచ్యూరిటీ తర్వాత మరో 3 ఏళ్లు ఖాతాను పొడిగించుకోవచ్చు.
వడ్డీ రేటు: ప్రస్తుత వార్షిక వడ్డీ రేటు 7.40శాతం
రిస్క్: నష్టభయం తక్కువగానే ఉంటుంది.
పెట్టుబడులు పరిమితి: ఇందులో కనీసం రూ. 1000, గరిష్ఠంగా రూ.15 లక్షలు వరకు ఒకేసారి పెట్టుబడి పెట్టవచ్చు.
పన్నులు: ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సి ప్రకారం పెట్టుబడి మొత్తంపై రూ.1.50 లక్షల వరకు మినహాయింపు పొందవచ్చు. వడ్డీ ఆదాయంపై వ్యక్తుల స్లాబ్ ప్రకారం పన్ను వర్తిస్తుంది. ఒకవేళ వడ్డీ ఆదాయం రూ. 50 వేలు దాటితే టీడీఎస్ కట్ చేస్తారు.
ఉద్యోగులు భవిష్య నిధి(ఈపీఎఫ్)..
ఇది ఉద్యోగుల పదవీవిరమణ కోసం ఉద్దేశించిన పథకం. ఉద్యోగి ప్రాథమిక వేతనం, డీఏ మొత్తంలో 12 శాతానికి సమానమైన మొత్తాన్ని ఉద్యోగి జీతం నుంచి డిడక్ట్ చేసి.. ఉద్యోగి పనిచేసే సంస్థ ఈపీఎఫ్‌కి జమచేస్తారు.
లిక్విడిటీ: ఉద్యోగి పదవీ విరమణ సమయంలో లేదా 2 నెలలకు పైగా ఉద్యోగం లేనప్పుడు పీఎఫ్ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు.
వడ్డీ రేటు: 2021-22 ఆర్థిక సంత్సరానికి ప్రభుత్వం ప్రకటించిన వడ్డీ రేటు 8.10 శాతం.
పెట్టుబడులు: ఉద్యోగి జీతంలో ప్రాథమిక వేతనం, డీఏ మొత్తంలో 12 శాతానికి సమానమైన మొత్తాన్ని ఉద్యోగి, సంస్థ ఇద్దరూ ఈపీఎఫ్‌కి కాంట్రీబ్యూట్ చేయాల్సి ఉంటుంది.
పన్నులు: ఈపీఎఫ్‌లో ఉద్యోగి వాటాకు సెక్షన్ 80సి కింద మినహాయింపు పొందవచ్చు.
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్)..
అర్హత: 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్న భారతీయ నివాసితులు ఈ ఖాతాను తెరవచ్చు.
లిక్విడిటి: కొన్ని నిర్దిష్ట సందర్భాల్లో 10 సంవత్సరాల తర్వాత పాక్షిక విత్‌డ్రాలను అనుమిస్తారు. పదవీ విరమణపై 60 శాతం మొత్తాన్ని ఒకేసారి విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగిలిన 40 శాతం యాన్యుటీలకు కేటాయించాల్సి ఉంటుంది.
రాబడి: ఎన్‌పీఎస్‌లో పెట్టుబుడులు మార్కెట్‌కి అనుసంధానమై ఉండడం వల్ల ఇందులో రాబడి ఎప్పుడూ ఒకేలా ఉండదు. 12 శాతం నుంచి 14 శాతం వరకు రాబడి వచ్చే అవకాశం ఉంటుంది.
రిస్క్: ఇది మార్కెట్‌తో అనుసంధానమై ఉంటుంది కాబట్టి నష్ట భయం ఉంటుంది.
పన్నులు: ఇందులో చేసిన పెట్టుబడులపై సెక్షన్ 80సి కింద మినహాయింపు పొందవచ్చు. అలాగే సెక్షన్ 80సీసీడి (1బి) కింద అదనంగా రూ. 50 వేల వరకు మినహాయింపు పొందవచ్చు.
చివరిగా.. పైన తెలిపిన పథకాలతో పాటు ఇంటి రుణం తీసుకున్నప్పుడు చెల్లించే అసలు మొత్తంపైనా, పిల్లల కోసం చెల్లించే ట్యూషన్ ఫీజుపైనా, జీవిత బీమా కోసం చెల్లించే ప్రీమియం పైనా సెక్షన్ 80సి కింద మినహాయింపు పొందవచ్చు. అయితే ఈ సెక్షన్ కింద అన్ని పెట్టుబడులు, చెల్లింపులకు కలిపి ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు మాత్రమే మినహాయింపు లభిస్తుంది. మీరు ఉద్యోగులైతే ముందుగా ఈపీఎఫ్ కింద పెట్టుబడులను లెక్కించి, మిగిలిన పెట్టుబుడులు, చెల్లింపులను పరిగణలోకి తీసుకుని ఈ సెక్షన్ కింద పూర్తి ప్రయోజనం పొందే ప్రయత్నం చేయవచ్చు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social Look: నయన్- విఘ్నేశ్‌ల ‘హ్యాపీ’ సెల్ఫీ.. రాశీ ఖన్నా స్టైల్ చూశారా!
-
General News
KRMB: మా విజ్ఞప్తిని కృష్ణాబోర్డు తప్పుగా అర్థం చేసుకుంది: తెలంగాణ ఈఎన్సీ
-
General News
Telangana News: హైదరాబాద్ - విజయవాడ హైవేపై 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
-
India News
Himanta Biswa Sarma: ఆమిర్ ఖాన్.. మీరు మా రాష్ట్రానికి ఆగస్టు 15 తర్వాతే రండి..!
-
General News
Agnipath: విశాఖలో ఎల్లుండి నుంచి అగ్నిపథ్ ర్యాలీ.. ఏర్పాట్లు చేస్తున్న ఆర్మీ అధికారులు
-
India News
Euthanasia: కారుణ్య మరణం కోసం స్విట్జర్లాండ్‌కు..? అడ్డుకోవాలని కోర్టును ఆశ్రయించిన మిత్రురాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Pavan tej: కొణిదెల హీరో నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్..
- సారూ.. ఈ తిండి ఎలా తినగలం?.. నడిరోడ్డుపై ఏడ్చేసిన కానిస్టేబుల్
- GST On Rentals: అద్దెపై 18% జీఎస్టీ.. కేంద్రం క్లారిటీ
- Macherla Niyojakavargam Review: రివ్యూ: మాచర్ల నియోజకవర్గం
- Arjun Tendulkar: ముంబయిని వీడనున్న అర్జున్ తెందుల్కర్
- Vizag Beach: వైజాగ్ ఆర్కే బీచ్‌లో నల్లగా మారిపోయిన ఇసుక..
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (12/08/2022)
- Rishabh Pant: రిషభ్ పంత్‌కు కౌంటర్ ఇచ్చిన బాలీవుడ్ నటి..
- Dilraju: ‘దిల్ రాజు గారూ’ మా బాధ వినండి.. 36వేల ట్వీట్స్..!
- Ashwini Dutt: ఆ సినిమా చేసి నేనూ అరవింద్ రూ. 12 కోట్లు నష్టపోయాం: అశ్వనీదత్