పొదుపు ఖాతాలుండ‌గా ఫిక్స్‌డ్ డిపాజిట్లే ఎందుకు?

భ‌ద్ర‌త‌తో కూడిన, క‌చ్చిత‌మైన రాబ‌డి పొందేందుకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో పొదుపు చేసేందుకు మొగ్గు చూపుతారు. మ‌రి బ్యాంకు పొదుపు ఖాతాలు ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే మేలైన వ‌డ్డీ రేట్ల‌ను అందిస్తే…మ‌రి అలాంటి పొదుపు ఖాతాలున్నాయ‌న్న విష‌యం మీకు తెలుసా ఫిక్స్డ్ డిపాజిట్ల‌లో పొదుపు చేస్తే అధిక ప‌న్ను రేట్ల‌తో పాటు, ఇత‌ర స‌మ‌స్య‌లు ఉంటాయి. మ‌రి పొదుపు ఖాతాల‌లో..

Published : 17 Dec 2020 15:37 IST

భ‌ద్ర‌త‌తో కూడిన, క‌చ్చిత‌మైన రాబ‌డి పొందేందుకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో పొదుపు చేసేందుకు మొగ్గు చూపుతారు. మ‌రి బ్యాంకు పొదుపు ఖాతాలు ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే మేలైన వ‌డ్డీ రేట్ల‌ను అందిస్తే…మ‌రి అలాంటి పొదుపు ఖాతాలున్నాయ‌న్న విష‌యం మీకు తెలుసా ఫిక్స్డ్ డిపాజిట్ల‌లో పొదుపు చేస్తే అధిక ప‌న్ను రేట్ల‌తో పాటు, ఇత‌ర స‌మ‌స్య‌లు ఉంటాయి. మ‌రి పొదుపు ఖాతాల‌లో డిపాజిట్ చేసి అంతే భ‌ద్ర‌ద‌తో కూడిన , క‌చ్చిత‌మైన రాబడిని పొందాలంటే యాక్సిస్ బ్యాంక్, య‌స్ బ్యాంక్, కోట‌క్ మ‌హీంద్రా బ్యాంక్ అందిస్తున్న ప్ర‌త్యేక పొద‌పు ఖాతాల‌ను ప‌రిశీలించాలి.

FDs.jpg

స్వల్ప కాలానికి డ‌బ్బును పొదుపు చేయ‌డం, అత్య‌వ‌స‌ర నిధిని ఏర్పాటు చేసుకునేందుకు ఈ పొదుపు ఖాతాలు స‌రైన‌వ‌వ‌ని ఆర్థిక నిపుణుల చెప్తున్నారు. ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌తో పోలిస్తే ఈ ఖాతాలలోని డ‌బ్బునే ఎలాంటి రుసుములు లేకుండా త‌క్ష‌ణమే డ‌బ్బును పొంద‌వ‌చ్చు. ఈ విధ‌మైన పొదుపు ఖాతాల‌కు సంవ‌త్స‌రానికి రూ.10 వేల వ‌ర‌కు సెక్ష‌న్ 80టీటీఏ ప్ర‌కారం ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. ఈ ఖాతాలు ఇ-కేవైసీ విధానం ద్వారా ఆన్‌లైన్‌లో త‌క్ష‌ణ‌మే ప్రారంభించ‌వ‌చ్చు. అయితే ఈ ఖాతాల‌పై చెక్కు బుక్స్‌, డెబిట్ కార్డ్‌, బ్యాంకింగ్ సేవ‌ల‌ను అందించేందుకు బ్యాంకులు కొన్ని ప‌రిమితులు విదించ‌వ‌చ్చు.

గమనిక: లేటెస్ట్ వడ్డీ రేట్ల కోసం ఆయా బ్యాంకు వెబ్సైటుని చుడండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని