Seized Vehicles: వేలంలో వాహనం కొంటున్నారా? ఇవన్నీ చూశాకే..!
Seized Vehicles purchase guide: బ్యాంకులు వేలం వేసే వాహనాలను కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే కొనే ముందు ఏమేం చూడాలి?
ఇంటర్నెట్ డెస్క్: కారు, బైక్ కొనాలని చాలా మందికి ఉంటుంది. కొత్తది కొనాలంటే కొంతమందికి ఆర్థిక పరిస్థితి సహకరించకపోవచ్చు. అలాంటి వారు తక్కువ ధరకే వాహనాన్ని సొంతం చేసుకునే మార్గం ఉంది.. అదే బ్యాంకులు నిర్వహించే వేలం. సకాలంలో చెల్లింపులు చేయని వాహనదారుల నుంచి స్వాధీనం చేసుకున్న వాటిని బ్యాంకులు వేలంలో విక్రయిస్తాయి. ఒకవేళ వేలం ప్రక్రియలో పాల్గొనదలిస్తే ఈ విషయాలు తెలుసుకోండి. తక్కువ ధరకే మంచి కండీషన్‌లో ఉన్న వాహనాన్ని సొంతం చేసుకోవడంలో ఈ విషయాలు మీకు సాయపడతాయి.
సీజ్ చేసిన వాహనాలంటే?
చాలా మంది తమ ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకోకుండా వాహనాలను కొనుగోలు చేస్తుంటారు. తీరా తిరిగి చెల్లింపులు చేయాల్సిన సందర్భంలో విఫలమవుతుంటారు. ఇలాంటి వారి దగ్గర నుంచి వాహనాన్ని రుణ సంస్థలు స్వాధీనం చేసుకుంటాయి. అలా తమ వద్ద పోగుపడిన వాహనాలను ఏకకాలంలో వేలం నిర్వహిస్తాయి. ఇందులో వాహనాన్ని దక్కించుకునే వారికి రిజిస్ట్రేషన్, ఇతరత్రా డాక్యుమెంట్లన్నింటినీ కొనుగోలు చేసిన వారికి అందిస్తారు. దీంతో కొనుగోలుదారులకు భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులూ రావు.
ప్రయోజనాలు ఇవే..
- సీజ్ చేసిన వాహనాలు సాధారణంగా తక్కువ ధరకే లభిస్తాయి. వేలంలో వాహనం విక్రయించడం ద్వారా తమ సొమ్మును రాబట్టుకోవడం బ్యాంకుల ప్రధాన ఉద్దేశం. కాబట్టి మార్కెట్ ధరతో పోలిస్తే ఇక్కడ వాహనం తక్కువ ధరకే లభిస్తుంది.
- సీజ్ చేసిన వాహనాల్లో వివిధ కంపెనీలకు చెందినవి, వివిధ మోడళ్లు ఉంటాయి. బైక్ లేదా కారు ఏదైనా సరే.. ప్రాథమిక స్థాయి నుంచి హై ఎండ్ వరకు వివిధ మోడళ్లు ఇక్కడ లభిస్తాయి. అందులో మీకు నచ్చినది ఎంపిక చేసుకోవచ్చు.
- కొన్నిసార్లు బయట ఎక్కడా లభించని వాహనాలు సైతం వేలంలో కనిపిస్తాయి. కొందరు తమకు అనువుగా వాహనాలను కస్టమైజ్ చేయించుకుంటూ ఉంటారు. ఒకవేళ అది మనకు నచ్చితే వాటిని ఎలాంటి ఖర్చూ లేకుండా సొంతం చేసుకోవచ్చు.
ప్రతికూలతలూ ఉన్నాయ్
- సీజ్ చేసిన వాహనానికి సంబంధించి వాహన చరిత్ర ఏదీ అందుబాటులో ఉండదు. కొనుగోలుదారులకు ఇది ఇబ్బంది కలిగించే అంశం. ఆ కారు లేదా బైక్ వాస్తవ పరిస్థితి ఏంటనేది తెలుసుకోవడం కష్టంతో కూడుకున్న వ్యవహారం.
- వాహనాన్ని ఎలా ఉందో అలానే విక్రయిస్తారు. దానికి గ్యారెంటీ, వారెంటీలు లాంటివి ఏవీ లభించవు. కాబట్టి వాహనం కొనుగోలు అనంతరం రిపేర్, సర్వీసింగ్ చేయించుకోవాల్సి రావొచ్చు.
- వాహన కొనుగోలులో మీరొక్కరే పాల్గొరనే విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఏదైనా వాహనం నచ్చి వేరే వ్యక్తి పోటీ పడితే ఒక్కోసారి దాని ధర అమాంతం పెరిగే పోయే అవకాశం ఉంటుంది. దీంతో తక్కువ ధరకే లభించాల్సిన వాహన ధర బాగా పెరగొచ్చు.
కొనే ముందు ఇవి ముఖ్యం..
- బ్యాంకులు/ ఆర్థిక సంస్థలు వేలం వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తాయి. ఒకవేళ అందులో పాల్గొనాలనుకుంటే మీరు కొనాలనుకుంటున్న వాహనం గురించి ముందే కొంత రీసెర్చి చేయాలి. వాహనం వాస్తవ విలువ ఎంత? ఇప్పుడు ఎంతకు కొనుగోలు చేస్తే సరిపోతుంది? అనే దాని గురించి తెలుసుకోవాలి.
- వేలంలో పాల్గొనే ముందే వాహనాన్ని ఓ సారి నేరుగా పరిశీలించడం మంచిది. ఏవైనా డ్యామేజీలు ఉంటే గుర్తించడానికి వీలు పడుతుంది.
- వాహనం, వేలం ప్రక్రియ విషయంలో మీకు అవగాహన లేకపోతే స్నేహితులు, తెలిసిన వారి సాయం తీసుకోండి.
- అన్నికంటే ముఖ్యంగా.. వేలంలో పాల్గొనే ముందే బడ్జెట్‌ను నిర్ణయించుకోండి. దీనివల్ల వేలంలో నిర్దేశిత పరిమితి దాటకుండా ఉండేందుకు ఇది దోహదపడుతుంది.
- కేవలం ఒక్క వేలం ప్రక్రియలో వాహనాన్ని కొనేయాలని అనుకోకుండా.. వీలుంటే మరిన్ని వేలం ప్రక్రియలకు హాజరు కావడం ద్వారా సరైన వాహనాన్ని కొనుగోలుకు అవకాశం ఉంటుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Ravi Shastri: డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు నా ఎంపిక ఇలా..: రవిశాస్త్రి
-
General News
CM KCR: ఉద్యమానికి నాయకత్వం.. నా జీవితం ధన్యమైంది: కేసీఆర్
-
World News
US Spelling Bee: అమెరికా స్పెల్లింగ్ బీ విజేతగా దేవ్‌షా..!
-
Politics News
Rahul Gandhi: 2024 ఫలితాలు ఆశ్చర్యపరుస్తాయ్..: రాహుల్ గాంధీ
-
Movies News
ponniyin selvan 2 ott release: ఓటీటీలోకి ‘పొన్నియిన్ సెల్వన్-2’.. ఆ నిబంధన తొలగింపు
-
General News
Telangana Formation Day: తెలంగాణ.. సాంస్కృతికంగా ఎంతో గుర్తింపు పొందింది..!