Debt ceiling crisis: అమెరికాకు తప్పిన దివాలా ముప్పు
Debt ceiling crisis: ఎట్టకేలకు గరిష్ఠ రుణ పరిమితి పెంపునకు సంబంధించిన బిల్లుపై అమెరికా ఉభయ సభలు ఆమోద ముద్ర వేశాయి. దీంతో అగ్రరాజ్యం దివాలా గండం నుంచి గట్టెక్కింది.
వాషింగ్టన్: అమెరికాకు దివాలా (US default) ముప్పు తప్పింది. అప్పుల పరిమితి పెంపునకు (Debt ceiling) సంబంధించిన కీలక బిల్లుకి అక్కడి ఉభయ సభల ఆమోదం లభించింది. ప్రతినిధుల సభలో బిల్లు నిన్న గట్టెక్కగా.. అమెరికా కాలమానం ప్రకారం గురువారం సెనేట్ కూడా ఆమోద ముద్ర వేసింది. దీంతో అప్పుల పరిమితి పెంచుకునేందుకు ప్రభుత్వానికి అవకాశం లభించింది. అధ్యక్షుడు బైడెన్ (Biden) సంతకం లాంఛనమే కాబట్టి బిల్లు వెంటనే చట్టరూపం దాల్చనుంది.
2021 నాటికి అమెరికన్ ప్రభుత్వం తీసుకున్న అప్పు 28.5 లక్షల కోట్ల డాలర్లకు (రూ.23,53,09,680 కోట్లు) చేరింది. యూఎస్ జీడీపీ కంటే ఇది 24 శాతం ఎక్కువ. ఇందులో ఎక్కువ మొత్తం దేశీయంగా వ్యక్తులు, సంస్థల నుంచి సేకరించగా.. దాదాపు 7 లక్షల కోట్ల డాలర్లను విదేశాల నుంచి సేకరించారు. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వ అప్పుల పరిమితి 31.4 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది. ఈ పరిమితిని సైతం దాటి అప్పులు చేయడానికి బైడెన్ ప్రభుత్వం కాంగ్రెస్ అనుమతి కోరింది. కానీ, ప్రతినిధుల సభలో సంఖ్యాపరంగా ఆధిక్యంలో ఉన్న రిపబ్లికన్లు అప్పు పరిమితి పెంచేందుకు తొలుత ససేమిరా అనడంతో గతకొంత కాలంగా ఆందోళన కొనసాగింది.
దీంతో అమెరికా రుణ గరిష్ఠ పరిమితి పెంపుపై అధ్యక్షుడు జో బైడెన్, స్పీకర్ కెవిన్ మెకార్థీ మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఎట్టకేలకు గత శనివారం ఇరు పక్షాల మధ్య రాజీ కుదరడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రెండేళ్లపాటు అప్పుల పరిమితి పెంపు, వ్యయ నియంత్రణపై సెనేట్‌లోని డెమోక్రాట్లు, ప్రతినిధుల సభలోని రిపబ్లికన్లు సూత్రప్రాయంగా ఒక అంగీకారానికి వచ్చి బిల్లుకు ఆమోదం తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Amazon Prime Video: అమెజాన్ ప్రైమ్ చందాదారులా? అయితే, ఈ విషయం తెలుసా?
-
Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ప్రభాస్‌తో పాటు ఆ స్టార్ హీరోయిన్!
-
IND vs AUS: ఆసీస్‌తో రెండో వన్డే.. శ్రేయస్ అయ్యర్‌కు ఇదేనా చివరి ఛాన్స్..?
-
Vizag: సిగరెట్ కోసం స్నేహితుడినే హతమార్చారు!
-
social look: అనుపమ ఉవాచ.. రష్మిక ఫస్ట్‌లుక్.. ఇంకా ఎన్నో ముచ్చట్లు..
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/09/2023)