సీనియ‌ర్‌ సిటిజ‌న్స్ ప‌న్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్ల వ‌డ్డీ రేట్లు

సీనియ‌ర్ సిటిజ‌న్‌ల ప‌న్ను ఆదా చేసే ఎఫ్‌డీలకు మూల‌ధ‌న భ‌ద్ర‌త ఉంటుంది.

Updated : 29 Jan 2022 17:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇపుడు ప‌న్ను ఆదా చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్‌ల‌పై వివిధ పబ్లిక్‌, ప్రైవేట్ సెక్టార్‌ బ్యాంకుల్లో  5.25% నుంచి 7.15% వ‌ర‌కు వ‌డ్డీ పొందొచ్చు. ఇవి సీనియ‌ర్ సిటిజ‌న్స్‌కు ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం, 1961లోని సెక్ష‌న్ 80సీ కింద ప‌న్ను ఆదా చేయ‌డానికి పెట్టుబ‌డి పెట్ట‌డానికి అనుమ‌తిస్తాయి. ఇటీవ‌ల కొన్ని బ్యాంకులు త‌మ ఎఫ్‌డీ రేట్ల‌ను పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించాయి. పెట్టుబ‌డి రిస్క్ లేకుండా ఉండ‌టం, వివిధ కాల వ్య‌వ‌ధుల‌ను ఎంచుకోవ‌డానికి అవ‌కాశం ఉండ‌టం, సీనియ‌ర్ సిటిజ‌న్‌ల‌కు బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు ప్రసిద్ధ ప‌న్ను ఆదా సాధ‌నాలుగా ఉన్నాయి.

సీనియ‌ర్ సిటిజ‌న్ల ప‌న్ను ఆదా ఎఫ్‌డీలకు మూల‌ధ‌న భ‌ద్ర‌త ఉంటుంది. సీనియ‌ర్ సిటిజ‌న్‌లు ప్ర‌తి నెలా ఖ‌ర్చుల అవ‌స‌రాలు, ఆరోగ్య ఖ‌ర్చులు ఎక్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ.. వ‌డ్డీ రాబ‌డి త‌క్కువ వ‌చ్చినా కూడా బ్యాంక్ ఎఫ్‌డీల‌కే ప్రాధాన్య‌ం ఇస్తారు. త‌మ‌కు డ‌బ్బు అవ‌స‌ర‌మున్నా కూడా రిస్క్ ప‌థ‌కాల‌లో త‌మ డ‌బ్బును ఉంచ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. దాదాపు అన్ని బ్యాంకులూ.. సీనియ‌ర్ సిటిజ‌న్ల ఎఫ్‌డీల‌పై కొద్దిగా ఎక్కువ‌ వ‌డ్డీ రేట్ల‌ను అందిస్తున్నాయి. 

డిపాజిట్ల వడ్డీని వార్షిక ఆదాయానికి జత చేస్తారు. దీనికి వారు పన్ను చెల్లించాల్సి రావచ్చు. అందుకే, సీనియ‌ర్ సిటిజ‌న్లు ప‌న్ను ఆదా చేసే ఎఫ్‌డీలను తీసుకోవ‌డం మంచిది. ఇవి సెక్ష‌న్ 80సీ కింద ప‌న్ను మినహాయింపునకు  అనుమ‌తిస్తాయి. ఈ సెక్ష‌న్ లో మీరు గ‌రిష్ఠంగా రూ.1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు పొందొచ్చు. ఈ డిపాజిట్‌ల‌కు 5 ఏళ్ల లాక్‌-ఇన్ వ్య‌వ‌ధి ఉంటుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్ తీసుకున్న త‌ర్వాత ముంద‌స్తు ఉప‌సంహ‌ర‌ణ‌, డిపాజిట్‌పై రుణాలు అనుమ‌తించ‌రు.

పెట్టుబ‌డిదారుల స్లాబ్ రేటు ప్ర‌కారం ఎఫ్‌డీ రాబ‌డిపై `టీడీఎస్‌` వ‌ర్తిస్తుంది. సీనియ‌ర్ సిటిజ‌న్లు ఫార‌మ్ 15హెచ్‌ ని బ్యాంక్‌కి స‌మ‌ర్పించ‌డం ద్వారా దీనిని నివారించ‌వ‌చ్చు. వారు కొన్ని నిబంధ‌న‌లు, ష‌ర‌తుల‌కు లోబ‌డి, ఐటీ చ‌ట్టంలోని సెక్ష‌న్ 80టీటీబీ కింద డిపాజిట్ల నుంచి వ‌చ్చే వ‌డ్డీ ఆదాయంపై రూ. 50 వేలు అద‌న‌పు ప‌న్ను మిన‌హాయింపును కూడా పొందొచ్చు.

త్రైమాసిక వ‌డ్డీని క‌లిపి 5 ఏళ్ల పాటు రూ. 1 ల‌క్ష పెట్టుబ‌డిపై బ్యాంకులు అందించే వ‌డ్డీ ఆఫ‌ర్‌ను సూచించే ప‌ట్టిక కింది ఉంది..

నోట్‌: ఈ డేటా 2022 జ‌న‌వ‌రి 25 నాటిది

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని