Stock market: ఆల్‌టైమ్‌ గరిష్ఠాలకు సూచీలు.. 23,500 ఎగువన ముగిసిన నిఫ్టీ

Stock market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 308, నిఫ్టీ 92 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి.

Published : 18 Jun 2024 16:04 IST

Stock market | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు (Stock market) లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో సరికొత్త గరిష్ఠాలను నమోదు చేశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 77,367 పాయింట్లు, నిఫ్టీ 23,579 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాలను తాకాయి. ఆ తర్వాత అదే జోరును కొనసాగిస్తూ సరికొత్త గరిష్ఠాల వద్ద ముగిశాయి. ముఖ్యంగా ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లలో కొనుగోళ్లు సూచీలకు కలిసొచ్చింది.

సెన్సెక్స్‌ ఉదయం 77,235.31 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా లాభాల జోరు కొనసాగింది. ఇంట్రాడేలో 77,071.44- 77,366.77 మధ్య కదలాడింది. చివరికి 308.37 పాయింట్ల లాభంతో 77,301.14 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 92.30 పాయింట్ల లాభంతో 23, 557.90 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.42గా ఉంది. సెన్సెక్స్‌లో పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, విప్రో, టైటాన్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా ప్రధానంగా లాభపడ్డాయి. మారుతీ సుజుకీ, టాటా స్టీల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్, టాటా మోటార్స్‌, ఐటీసీ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ చమురు ధర 84.06 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు ధర 2325 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని