Stock market: రాణించిన సూచీలు.. మరోసారి సరికొత్త గరిష్ఠాలకు

Stock market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 391, నిఫ్టీ 112 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.

Published : 09 Jul 2024 16:00 IST

Stock market | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) లాభాల్లో ముగిశాయి. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో సరికొత్త గరిష్ఠాలను నమోదు చేశాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, విదేశీ మదుపర్ల కొనుగోళ్లతో మార్కెట్‌లో ఉత్సాహం నెలకొంది. ముఖ్యంగా బ్లూచిప్‌ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతు సూచీలను నడిపించింది. దీంతో ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 80,397.17, నిఫ్టీ 24,433.20 వద్ద జీవనకాల గరిష్ఠాలను తాకాయి.

సెన్సెక్స్‌ ఉదయం 80,107.21 పాయింట్ల వద్ద  (క్రితం ముగింపు 79,960.38) లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా లాభాల్లోనే కొనసాగింది. చివరికి 391.26 పాయింట్ల లాభంతో 80,351.64 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 112.65 పాయింట్ల లాభంతో 24,433.20 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.49గా ఉంది. సెన్సెక్స్‌లో మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఐటీసీ, సన్‌ఫార్మా, టైటాన్‌ షేర్లు రాణించాయి. రిలయన్స్‌, కోటక్ మహీంద్రా బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ రకం బ్యారెల్‌ చమురు ధర 85.47, బంగారం ఔన్సు ధర 2370 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని