Stock market: రోజంతా ఒడుదొడుకులు.. చివర్లో ఫ్లాట్‌గా సూచీలు

Stock market Update: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. రోజంతా తీవ్ర ఒడుదొకులకు లోనయ్యాయి.

Published : 05 Dec 2022 15:55 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. వరుస లాభాల అనంతరం మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో సోమవారం ఉదయం సూచీలు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అనంతరం లాభనష్టాల మధ్య కదలాడాయి. దీంతో రోజంతా ఒడుదొడుకులకు లోనై చివర్లో ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్‌ స్వల్ప నష్టాల్లో ముగియగా.. నిఫ్టీ స్వల్ప లాభాలతో స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 81.80గా ఉంది.

ఉదయం 62,865 వద్ద స్వల్ప నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్‌.. ఓ దశలో 350 పాయింట్ల నష్టంతో 62,507కు చేరింది. అనంతరం లాభనష్టాల మధ్య కదలాడిన సూచీ.. చివరికి 33.90 పాయింట్ల నష్టంతో రూ.62,834.60 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం కేవలం 4.90 పాయింట్ల లాభంతో 18,701 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లో టాటా స్టీల్‌, ఎన్టీపీసీ, స్టేట్‌ బ్యాంక్‌ ఇండియా, ఇండస్‌ ఇండ్‌, పవర్‌ గ్రిడ్‌ షేర్లు లాభాల్లో ముగియగా.. రిలయన్స్‌, టెక్‌ మహీంద్రా, డాక్టర్‌ రెడ్డీస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఆటో, ఐటీ, ఫార్మా రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కనిపించగా.. పీఎస్‌యూ బ్యాంక్‌, రియల్టీ, మెటల్‌ షేర్లలో కొనుగోళ్ల మద్దతు కనిపించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని