Stock Market: ఆరో రోజూ లాభాలే.. సరికొత్త గరిష్ఠాలకు సూచీలు
Stock Market: అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు దూసుకెళ్తున్నాయి. ఈరోజు సూచీలు సరికొత్త జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేయడం విశేషం.
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా ఆరో సెషన్లోనూ లాభాల్లో దూసుకెళ్లాయి. మంగళవారం ఉదయం సానుకూలంగా ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు ఇంట్రాడేలో సరికొత్త జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేశాయి. సెన్సెక్స్ 62,887.40 వద్ద గరిష్ఠాన్ని తాకి చివరకు 177.84 పాయింట్ల లాభంతో రికార్డు ముగింపైన 62,681.84 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 55.30 పాయింట్ల లాభంతో 18,618.05 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 18,678.10 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.81.67 వద్ద నిలిచింది. సెన్సెక్స్ 30 సూచీలో హెచ్‌యూఎల్, సన్‌ఫార్మా, నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటన్, హెచ్‌సీఎల్ టెక్, ఐటీసీ షేర్లు అత్యధికంగా లాభపడ్డ జాబితాలో ఉన్నాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, మారుతీ, పవర్‌గ్రిడ్, ఎల్అండ్టీ, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, టెక్ మహీంద్రా షేర్లు నష్టపోయాయి. చమురు ధరలు దిగిరావడం, రూపాయి విలువ స్థిరంగా కొనసాగుతుండటం మార్కెట్ల పరుగుకు దోహదం చేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు ఉన్నా.. గతకొన్ని రోజులుగా మన మార్కెట్లు సానుకూలంగా కదలాడుతుండడం విశేషం. మరోవైపు ఈరోజు ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌యూఎల్, ఐటీసీ వంటి దిగ్గజ షేర్లు రాణించడం మార్కెట్లకు దన్నుగా నిలిచింది.
మార్కెట్లోని మరిన్ని విశేషాలు..
- గత రెండురోజుల్లో జేకే టైర్ స్టాక్ ధర 18 శాతానికి పైగా లాభపడింది. గత ఐదు నెలల్లో ఈ స్టాక్ విలువ రెండింతలు కావడం గమనార్హం. ఈరోజు ఇంట్రాడేలో షేరు ధర 3.5 శాతం లాభపడి రూ.204.00 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. చివరకు 0.90 శాతం ఎగబాకి రూ.195.30 వద్ద స్థిరపడింది.
- షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనల నేపథ్యంలో కాస్మోఫస్ట్ షేర్లు గత రెండు రోజుల్లో 17 శాతం ర్యాలీ అయ్యాయి. ఈరోజు 5.05 శాతం పెరిగి రూ.792.50 వద్ద ముగిసింది.
- భవిష్యత్తు వృద్ధి ఆందోళనల నేపథ్యంలో లారస్ ల్యాబ్ షేర్లకు ఈరోజు అమ్మకాల సెగ తగిలింది. దీంతో షేరు ధర ఈరోజు 9.29 శాతం నష్టపోయి రూ.408.50 వద్ద స్థిరపడింది.
- ఐడీబీఐ బ్యాంకు ప్రైవేట్ రంగ బ్యాంకుగానే కొనసాగుతుందని ఆర్థికశాఖ పునరుద్ఘాటించిన నేపథ్యంలో సంస్థ షేరు గత నాలుగు రోజుల్లో 15 శాతం పుంజుకుంది. ఇంట్రాడేలో 55.60 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 2.55 శాతం లాభంతో రూ.54.20 వద్ద స్థిరపడింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Easter Attacks: ‘నన్ను క్షమించండి..’ శ్రీలంక మాజీ అధ్యక్షుడు సిరిసేన
-
India News
Khushbu Sundar: వీల్‌ఛైర్ కోసం 30 నిమిషాలా?.. ఎయిరిండియాపై ఖుష్బూ అసహనం
-
Sports News
PCB: మికీ ఆర్థర్ పాక్ ‘ఆన్లైన్ కోచ్’.. సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువ
-
Technology News
WhatsApp: వాట్సాప్ వీడియో.. ఈ మార్పు గమనించారా..?
-
Movies News
RRR: ఆస్కార్ బరిలో నిలిచిన చిత్రాలను వెనక్కి నెట్టి.. నంబరు 1గా ‘ఆర్ఆర్ఆర్’
-
Politics News
AAP: కర్ణాటకపై ఆప్ గురి: అజెండాపై కసరత్తు.. పార్టీల హామీలపై కౌంటర్!