Stock Market: నష్టాల్లో మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు రికార్డు గరిష్ఠాలను చేరిన తర్వాత నేడు స్వల్పంగా అమ్మకాల ఒత్తిడితో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. 

Published : 10 Jul 2024 09:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ మార్కెట్‌ సూచీలు బుధవారం అప్రమత్తంగా ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. నిన్నటి ర్యాలీ తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీంతో సెన్సెక్స్‌ ఉదయం 9.19 సమయంలో 196 పాయింట్లు నష్టపోయి 80,154 వద్ద, నిఫ్టీ 25 పాయింట్ల నష్టంతో 24,407 సమీపంలో ట్రేడవుతున్నాయి. రైల్‌ వికాస్‌ నిగమ్‌, ఎల్‌జీ బాలకృష్ణన్‌ అండ్‌ బ్రదర్స్‌, జీహెచ్‌సీఎల్‌, గుజరాత్‌ మినరల్స్‌, కిమ్స్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతుండగా.. నేషనల్‌ ఫర్టిలైజర్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, రాష్ట్రీయ కెమికల్స్‌, హింద్‌ కాపర్‌ షేర్లు అత్యధిక నష్టాల్లో ఉన్నాయి. ప్రధాన రంగాల సూచీలు మొత్తం లాభాల్లోనే కొనసాగుతుండటం విశేషం. డాలర్‌తో పోలిస్తూ రూపాయి మారకం విలువ రూ.83.47 వద్ద కొనసాగుతోంది. 

మదుపర్ల సంపదగా పరిగణించే, బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ మంగళవారం రూ.1.56 లక్షల కోట్లు పెరిగి జీవనకాల గరిష్ఠమైన రూ.451.27 లక్షల కోట్లు (5.41 లక్షల కోట్ల డాలర్లు)గా నమోదైంది. దీంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. 

 ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లలో షాంఘై సూచీ, ద.కొరియాకు చెందిన కోస్పీ, ఆస్ట్రేలియాకు చెందిన ఏఎస్‌ఎక్స్‌ 200 మాత్రమే నష్టాల్లో కొనసాగుతున్నాయి. మిగిలిన ప్రధాన సూచీలు మొత్తం లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని