stock market: బడ్జెట్‌ ముంగిట.. భారీ ఊగిసలాటలో సూచీలు..!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభనష్టాల మధ్య దోబూచులాడుతున్నాయి. ఉదయం నష్టాలతో మొదలైన సూచీలు ఆ తర్వాత లాభాల్లోకి చేరుకొన్నాయి. 

Updated : 30 Jan 2023 09:44 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు బడ్జెట్‌ ముందు అప్రమత్తంగా ట్రేడవుతున్నాయి. శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో మూడు నెలల కనిష్ఠానికి చేరిన సూచీలు.. సోమవారం భారీ ఊగిసలాట మధ్య కొనసాగుతున్నాయి. మార్కెట్‌ ప్రారంభం కాగానే నిఫ్టీ దాదాపు 100 పాయింట్లు పతనమైనా ఆ తర్వాత కోలుకొని లాభాల్లోకి చేరింది. ఉదయం 9.30 సమయంలో నిఫ్టీ 88 పాయింట్ల లాభంతో 17,693 వద్ద, సెన్సెక్స్‌ 218 పాయింట్ల లాభంతో 59,549 వద్ద కొనసాగుతున్నాయి. బీఎస్‌ఈలో డేటా పాట్రన్స్‌, అంబుజా సిమెంట్‌, ఏఐజీ గ్రీన్‌పీస్, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, ఏసీసీ లాభాల్లో ఉండగా..  అదానీ టోటల్‌ గ్యాస్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ ట్రాన్స్‌మిషన్స్‌, సియారామ్‌ సిల్క్స్‌, అపర్‌ ఇండస్ట్రీస్‌ నష్టాల్లో ఉన్నాయి.

డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.49గా ఉంది. బుధవారం (ఫిబ్రవరి 1న) వెలువడనున్న బడ్జెట్‌ మార్కెట్లకు కీలకం కానుండటంతో సూచీలు అప్రమత్తంగా ట్రేడవుతున్నాయి. మరో వైపు అదానీ గ్రూప్‌లో చాలా కంపెనీల షేర్లు భారీ నష్టాల్లో ఉండటం కూడా మదుపర్లను ప్రభావితం చేస్తోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు