stock market: మార్కెట్‌పై బేర్‌ పట్టు..!

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు గురువారం భారీ నష్టాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం 9.22 సమయంలో నిఫ్టీ 218 పాయింట్లు కుంగి

Published : 12 May 2022 09:32 IST

భారీ నష్టాలతో ట్రేడింగ్‌ ప్రారంభించిన  సూచీలు

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు గురువారం భారీ నష్టాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం 9.22 సమయంలో నిఫ్టీ 218 పాయింట్లు కుంగి 15,948 వద్ద, సెన్సెక్స్‌ 766 పాయింట్లు పతనమై 53,321 వద్ద ట్రేడవుతున్నాయి. మంగళూరు రిఫైనరీ, ఓరియంట్ సిమెంట్‌, కేఆర్‌బీఎల్‌, కల్పతరు పవర్‌, జీహెచ్‌సీఎల్‌ షేర్లు భారీగా లాభపడగా.. రిలాక్సో ఫుట్‌వేర్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, ఎల్గీ ఎక్విప్‌మెంట్స్‌, ప్రిసమ్‌ జాన్సన్‌ షేర్లు భారీగా కుంగాయి. ఇక రంగాల వారీగా స్థిరాస్తి సూచీ ఒక్కటే లాభాల్లో కొనసాగుతోంది. మిగిలిన సూచీలు నష్టాల్లోనే ఉన్నాయి. అత్యధికంగా టెలికం సూచీ 1శాతం  పతనమైంది. 

నేడు నాలుగో త్రైమాసిక ఫలితాలను వెల్లడించనున్న కంపెనీల్లో ఎల్‌అండ్‌టీ, టాటామోటార్స్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, అపోలో టైర్స్‌ కంపెనీలు వున్నాయి. నిన్న అంతర్జాతీయ  మార్కెట్లు కూడా భారీ నష్టాల్లో ముగిశాయి. అమెరికా మార్కెట్‌ సూచీలైన డోజోన్స్‌ 1.2శాతం, ఎస్‌అండ్‌పీ 500 1.65శాతం, నాస్‌డాక్‌ 3.18శాతం కుంగాయి. ఆ ప్రభావం భారత్‌ మార్కెట్లపై కూడా ప్రతికూలంగా పడింది. నేటి ఉదయం ఆసియా మార్కెట్లు భారీగా పతనం అయ్యాయి. హాంగ్‌సెంగ్‌, నిక్కీ సూచీలు 1.1శాతం పడిపోయాయి. స్ట్రెయిటైమ్స్‌, కేవోఎస్‌పీఐ సూచీలు 0.5శాతం పతనం అయ్యాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ధర 5శాతం, డబ్ల్యూటీఐ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 6శాతం చొప్పున పెరిగాయి. ఇవి పీపాకు వరుసగా 105, 107 డాలర్లు పలుకుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని