Stock Market: కొనసాగుతున్న లాభాల పరంపర.. 18,650 ఎగువన నిఫ్టీ
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల్లో లాభాల పరంపర కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ మన మార్కెట్లలో మాత్రం సానుకూలతలు కొనసాగుతున్నాయి.
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. కొనుగోళ్ల మద్దతుతో కాసేపటికే స్పష్టమైన లాభాల్లో ఎగబాకాయి. గత కొన్ని రోజుల ట్రెండ్‌ను కొనసాగిస్తూ అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ.. దేశీయ సూచీలు రాణిస్తున్నాయి. అయితే, సూచీలు గరిష్ఠాల వద్ద ట్రేడవుతున్న నేపథ్యంలో ఈరోజు కొంత స్థిరీకరణ దిశగా పయనించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు నేడు ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ కీలక సదస్సులో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో రేట్ల పెంపుపై ఆయన కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. దీనిపైనా మదుపర్లు దృష్టి సారించే అవకాశం ఉంది.
ఈ పరిణామాల మధ్య ఉదయం 9:29 గంటల సమయంలో సెన్సెక్స్ 81 పాయింట్ల లాభంతో 62,762 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 36 పాయింట్లు ఎగబాకి 18,654 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.58 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో ఎంఅండ్ఎం, డాక్టర్ రెడ్డీస్, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్‌యూఎల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎన్టీపీసీ, సన్‌ఫార్మా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇన్ఫోసిస్, పవర్‌గ్రిడ్, టెక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, రిలయన్స్, టీసీఎస్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
గమనించాల్సిన స్టాక్స్...
గ్లాండ్ ఫార్మా: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న గ్లాండ్ ఫార్మాలో వాటాను, ఆ సంస్థ ప్రమోటర్‌గా ఉన్న చైనా సంస్థ ఫోసున్ ఫార్మా విక్రయించనున్నట్లు మార్కెట్ వర్గాల్లో ప్రచారమవుతోంది.
అదానీ ఎంటర్ప్రైజెస్: అదానీ ఎంటర్ప్రైజెస్ ఎఫ్పీఓలో షేర్లను రాయితీ ధరకే ఇవ్వడం ద్వారా చిన్న మదుపర్లను ఆకర్షించాలని చూస్తున్నట్లు కంపెనీ సీఎఫ్ఓ జుగేషిందర్ సింగ్ పేర్కొన్నారు.
జొమాటో: బ్లాక్ డీల్ ద్వారా జొమాటోలోని తన వాటాల్లో 3 శాతం విక్రయించేందుకు అలీబాబా గ్రూప్ హోల్డింగ్స్ యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం అలీబాబాకు 13.3 శాతం వాటాలున్నాయి.
ఎస్బీఐ: 2022-23లో పబ్లిక్ ఇష్యూ లేదా ప్రైవేట్ ప్లేస్మెంట్ పద్ధతిలో మౌలిక బాండ్లను జారీ చేయడం ద్వారా రూ.10000 కోట్లు సమీకరించడానికి బోర్డు ఆమోదం తెలిపినట్లు ఎస్బీఐ ప్రకటించింది.
బ్రిటానియా: ఫ్రాన్స్‌కు చెందిన చీజ్ మేకర్ బెల్ ఎస్ఏతో బ్రిటానియా ఇండస్ట్రీస్ సంయుక్త భాగస్వామ్యం కుదుర్చుకొంది. ఇందులో భాగంగా భారత్ సహా మరికొన్ని మార్కెట్లకు చీజ్ ఉత్పత్తులను తయారు చేసి బ్రిటానియా విక్రయించనుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
IndiGo: అత్యవసర ద్వారం కవర్ తొలగింపు యత్నం.. విమానం గాల్లో ఉండగా ఘటన!
-
Technology News
E-Waste: ఈ-వ్యర్థాల నియంత్రణ దిశగా భారత్ అడుగులు!
-
General News
TTD: తిరుమలలో ఆగమశాస్త్రాన్ని విస్మరిస్తున్నారు: రమణ దీక్షితులు
-
Movies News
Rajinikanth: అనుమతి లేకుండా అలా చేస్తే చర్యలు తప్పవు :రజనీకాంత్
-
India News
Narendra Modi : ఆదివాసీ సేవలో విరిసిన ‘పద్మా’లు: మోదీ
-
Movies News
Anurag Kashyap: సుశాంత్ చనిపోవడానికి ముందు మెసేజ్ వచ్చింది: అనురాగ్ కశ్యప్