stock market: లాభాల్లో దేశీయ మార్కెట్‌ సూచీలు

దేశీయ మార్కె్ట్‌ సూచీలు గురువారం ఉదయం లాభాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం 9.24 సమయంలో నిఫ్టీ 73 పాయింట్ల లాభంతో 16,098 వద్ద, సెన్సెక్స్‌ 282 పాయింట్ల లాభంతో 5

Updated : 26 May 2022 09:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ మార్కెట్‌ సూచీలు గురువారం ఉదయం లాభాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం 9.24 గంటల సమయంలో నిఫ్టీ 73 పాయింట్ల లాభంతో 16,098 వద్ద, సెన్సెక్స్‌ 282 పాయింట్ల లాభంతో 54,032 వద్ద ట్రేడవుతున్నాయి.  హిందాల్కో, టాటాస్టీల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, పవర్‌ గ్రిడ్‌, అదానీ పోర్ట్స్‌ అత్యధికంగా లాభాల్లో ఉండగా.. ఐటీసీ, అపోలో హాస్పిటల్స్‌, బీపీసీఎల్‌, ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. 

డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఫ్లాటుగా మొదలై రూ.77.53గా ఉంది. అమెరికా మార్కెట్లు నిన్న లాభాల్లో ట్రేడింగ్‌ను ముగించడం సానుకూలాంశం. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. హాంగ్‌సెంగ్‌ సూచీ నష్టాల్లో ఉండగా.. నిక్కీ సూచీ లాభాల్లో ఉంది. చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని