Stock market: వరుసగా మూడో రోజూ లాభాల్లో సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాల నేపథ్యంలో వరుసగా మూడో రోజూ రాణించాయి.

Published : 27 Jun 2022 15:50 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాల నేపథ్యంలో వరుసగా మూడో రోజూ రాణించాయి. అమెరికా సహా ఆసియా మార్కెట్లు లాభాల బాటలో పయనించడానికి తోడు క్రూడాయిల్‌ ధరలు తగ్గుముఖం పట్టడం కలిసొచ్చింది. దేశీయంగా నైరుతి రుతు పవనాల వల్ల రానున్న రోజుల్లో వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ ప్రకటన సైతం మదుపరుల్లో సానుకూలతను నింపింది. దీంతో సెన్సెక్స్‌ 400 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ 15,800 పాయింట్ల ఎగువన ముగిసింది. మార్కెట్‌ ముగిసే సమయానికి డాలరుతో రూపాయి మారకం విలువ 78.34గా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం ఉదయం 53,316 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్‌ రోజంతా లాభాల్లోనే కొనసాగింది. ఓ దశలో 53,509 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 433.30 పాయింట్ల లాభంతో 53,161.28 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 132.80 పాయింట్లు లాభపడి 15,832 పాయింట్ల వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లో ఎల్‌అండ్‌ టీ, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు ప్రధానంగా రాణించాయి. కోటక్‌ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టైటాన్‌ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి. అన్ని రంగాల షేర్లు లాభాల్లో ముగియగా.. ముఖ్యంగా ఐటీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, మెటల్‌ షేర్లు రాణించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని