Stock Market: వరుసగా ఆరో రోజు సెన్సెక్స్‌ లాభాల పరుగు.. నిఫ్టీ @ 23,550

Stock Market Closing Bell: దేశీయ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 140 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 23,550 మార్క్‌ దాటింది.

Published : 20 Jun 2024 16:06 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్ల (Stock Market) లాభాల పరుగు కొనసాగుతోంది. తీవ్ర ఒడుదొడుకులు ఉన్నప్పటికీ వరుసగా ఆరో రోజూ సెన్సెక్స్‌ లాభాలను దక్కించుకుంది. క్రితం సెషన్‌లో గరిష్ఠాల నుంచి వెనక్కి వచ్చిన నిఫ్టీ గురువారం మళ్లీ పుంజుకుంది. నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ (Sensex) 140 పాయింట్లు లాభపడి కొత్త రికార్డుతో ముగియగా.. నిఫ్టీ (Nifty) 23,550 మార్క్‌ దాటింది.

ఈ ఉదయం సూచీలు ఉత్సాహంగానే ప్రారంభమైనప్పటికీ.. దేశీయంగా, అంతర్జాతీయంగా మార్కెట్‌పై ప్రభావం చూపే పరిణామాలు పెద్దగా లేకపోవడంతో ఆ తర్వాత ట్రేడింగ్‌ను స్తబ్దుగా సాగించాయి. 77,554 పాయింట్ల వద్ద మొదలైన సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 77,643 గరిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో ఒక దశలో 77,100 పాయింట్ల కనిష్ఠాన్ని తాకిన సూచీ చివరకు 141.34 పాయింట్ల లాభంతో 77,478.93 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ 51 పాయింట్లు లాభపడి 23,567 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 20 పైసలు క్షీణించి 83.64 వద్ద ఆల్‌టైం కనిష్ఠాన్ని తాకింది.

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌, ఆటోమొబైల్‌, ఫార్మా రంగాల్లో అమ్మకాలు జరగ్గా.. లోహ, క్యాపిటల్‌ గూడ్స్‌, రియల్టీ, చమురు రంగ షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. నిఫ్టీలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్‌, హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, అదానీ పోర్ట్స్‌, భారత్‌ పెట్రోలియం షేర్లు లాభపడ్డాయి. హీరో మోటార్స్‌, సన్‌ఫార్మా, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఎన్టీపీసీ, విప్రో షేర్లు నష్టపోయాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు