Stock market: సూచీల సరికొత్త రికార్డు.. 78 వేలు దాటిన సెన్సెక్స్‌

Stock market: దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. సెన్సెక్స్‌ 78వేల మార్కును తొలిసారి దాటింది.

Published : 25 Jun 2024 15:56 IST

Stock market | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) సరికొత్త రికార్డును నెలకొల్పాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ వంటి స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతుతో ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 78164.71 పాయింట్ల వద్ద, నిఫ్టీ 23,754.15 పాయింట్ల వద్ద ఆల్‌టైమ్‌ గరిష్ఠాలను నమోదు చేశాయి. సెన్సెక్స్‌ 78 వేల మార్కును దాటడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

సెన్సెక్స్ ఉదయం 77,529.19 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 77,341.08) లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా లాభాల్లోనే కొనసాగింది. చివరికి 712.44 పాయింట్ల లాభంతో 78,053.52 వద్ద ముగిసింది. నిఫ్టీ 183.45 పాయింట్ల లాభంతో 23,721.30 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.44గా ఉంది. సెన్సెక్స్‌ 30 సూచీలో యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, ఎల్‌అండ్‌టీ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఏషియన్‌ పెయింట్స్‌, టాటా స్టీల్‌, మారుతీ సుజుకీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేర్లు నష్టపోయాయి.

ఇండెక్సేషన్‌ అంటే ఏంటి ? ఇది పన్ను భారాన్ని ఎలా తగ్గిస్తుంది?

గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో మన దేశ కరెంట్‌ ఖాతా మిగులు 5.7 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. ఇది జీడీపీలో 0.6 శాతానికి సమానమని ఆర్‌బీఐ సోమవారం వెల్లడించింది. దీన్నో పాజిటివ్‌ సంకేతంగా మార్కెట్‌ భావించిందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌లో చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటజిస్ట్‌ వీకే విజయ్‌కుమార్‌ తెలిపారు. ఫెడ్‌ వడ్డీ రేట్ల గురించి స్పష్టత వచ్చాక మన మార్కెట్లోకి ఎఫ్‌ఐఐల పెట్టుబడుల పెరిగేందుకు, రూపాయిపై ఒత్తిడి తగ్గించేందుకు ఇది దోహదం చేస్తుందని తెలిపారు. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ చమురు ధర 85.61 డాలర్ల వద్ద, బంగారం ఔన్సు 2345 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని