Stock Market: ఫ్లాట్‌గా దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Stock Market: రెండు కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు స్తబ్ధుగా ట్రేడవుతున్నాయి.

Updated : 08 Dec 2022 09:56 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్ (Stock Market) సూచీలు గురువారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. అమెరికా మార్కెట్లు వరుసగా ఐదోరోజైన బుధవారమూ నష్టపోయాయి. ఆసియా-పసిఫిక్‌ సూచీలు సైతం నేడు స్తబ్ధుగానే ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న గుజరాత్‌, హిమాచల్‌ అసెంబ్లీ ఎన్నికల లెక్కింపుపైనా మదుపర్లు దృష్టి సారించనున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో ఉదయం 9:35 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 09 పాయింట్ల నష్టంతో 62,401 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 2 పాయింట్లు స్వల్ప నష్టంతో 18,557 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.26 వద్ద ఉంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఎంఅండ్‌ఎం, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, నెస్లే ఇండియా, టైటన్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, రిలయన్స్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, టీసీఎస్‌, పవర్‌గ్రిడ్‌, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌యూఎల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, టెక్‌ మహీంద్రా, సన్‌ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

గమనించాల్సిన స్టాక్స్‌..

యాక్సిస్‌ బ్యాంక్‌: టైర్‌-2 బాండ్ల ద్వారా రూ.12,000 కోట్లు సమీకరించాలని యాక్సిస్‌ బ్యాంక్‌ నిర్ణయించింది.

స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్‌: ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ ఆధారంగా డిబెంచర్లు జారీ చేయడంపై డిసెంబరు 10న స్పందన స్ఫూర్తి బోర్డు భేటీ కానుంది.

ల్యూమాక్స్‌ ఇండస్ట్రీస్‌: పుణెలో కొత్త ప్రాజెక్టు ఏర్పాటుకు ల్యూమాక్స్‌ బోర్డు ఆమోదం తెలిపింది. దీనికి అవసరమైన నిధులను లాంగ్‌ టర్మ్‌ క్రెడిట్‌ ఫెలిసిటీస్‌ మార్గంలో సమకూర్చుకోవాలని నిర్ణయించింది.

మెట్రో బ్రాండ్స్‌: ఫిలా, ప్రోలైన్‌ సహా పలు బ్రాండ్ల పేరిట దుస్తులు, పాదరక్షలు, యాక్సెసరీస్‌ విక్రయిస్తున్న క్రావాటెక్స్‌లో 100 శాతం వాటాల కొనుగోలు ప్రక్రియను మెట్రో బ్రాండ్స్ పూర్తి చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని