Stock Market: ఐదు రోజుల వరుస నష్టాలకు బ్రేక్‌

ఎట్టకేలకు స్టాక్‌ మార్కెట్‌లో గత వరుస ఐదు సెషన్ల నష్టాలకు బుధవారం బ్రేక్‌ పడింది....

Published : 20 Apr 2022 15:46 IST

ముంబయి: ఎట్టకేలకు స్టాక్‌ మార్కెట్‌లో గత వరుస ఐదు సెషన్ల నష్టాలకు బుధవారం బ్రేక్‌ పడింది. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు ఆద్యంతం అదే బాటలో పయనించాయి. ఇటీవలి భారీ నష్టాల నేపథ్యంలో కనిష్ఠాల వద్ద నాణ్యమైన స్టాక్స్‌లో మదుపర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. అలాగే ఆటో, ఇంధనం, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ రంగాలు రాణించడం మార్కెట్లకు కలిసొచ్చింది. మరోవైపు దేశవ్యాప్తంగా డిజిటల్‌ బ్యాంకుల ఏర్పాటుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటన మార్కెట్ల సెంటిమెంటును పెంచింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలూ మార్కెట్లను ముందుకు నడిపించాయి.

ఉదయం సెన్సెక్స్‌ 56,741.43 వద్ద లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో  57,216.51 - 56,521.33 మధ్య కదలాడింది. చివరకు 574.35 పాయింట్ల లాభంతో 57,037.50 వద్ద ముగిసింది. 17,045.25 వద్ద ప్రారంభమైన నిఫ్టీ చివరకు 193.10 పాయింట్లు లాభపడి 17,151.75 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 17,186.90 - 16,978.95 మధ్య చలించింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.76.22 వద్ద ట్రేడవుతోంది.

సెన్సెక్స్‌ 30 సూచీలో అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, మారుతీ, రిలయన్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, టీసీఎస్‌, హెచ్‌యూఎల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు లాభపడ్డాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఐటీసీ, టాటా స్టీల్‌, ఎల్‌అండ్‌టీ, పవర్‌గ్రిడ్‌, ఎస్‌బీఐ షేర్లు నష్టపోయిన వాటిలో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని