Stock Market: వరుస నష్టాలకు బ్రేక్‌.. లాభాల్లో ముగిసిన సూచీలు

స్టాక్‌ మార్కెట్ల మూడు రోజుల వరుస నష్టాలకు అడ్డుకట్ట పడింది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలకు తోడు దేశీయంగా కీలక రంగాల షేర్లలో వెల్లువెత్తిన కొనుగోళ్లు మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపర్చాయి

Published : 26 May 2022 15:54 IST

ముంబయి: మూడు రోజుల వరుస నష్టాలకు అడ్డుకట్ట పడింది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలకు తోడు దేశీయంగా కీలక రంగాల షేర్లలో వెల్లువెత్తిన కొనుగోళ్లు మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపర్చాయి. దీంతో నేటి ట్రేడింగ్‌లో సూచీలు లాభాలను దక్కించుకున్నాయి. సెన్సెక్స్‌ 500 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ కూడా 100 పాయింట్లకు పైనే ఎగబాకింది.

సూచీల పయనం సాగిందిలా..

అంతర్జాతీయ మార్కెట్ల బలమైన సంకేతాలతో ఈ ఉదయం 53,950 పాయింట్ల లాభంతో ఉత్సాహంగా మొదలైన సెన్సెక్స్‌ ఆరంభంలో కాస్త తడబడింది. ఒక దశలో 53,425 వద్ద ఇంట్రాడే కనిష్ఠానికి పడిపోయింది. అయితే ఆ తర్వాత ఐటీ, లోహ రంగాల షేర్లలో కొనుగోళ్ల అండతో పుంజుకున్న సూచీ మళ్లీ లాభాల బాట పట్టింది. మొత్తంగా నేటి ట్రేడింగ్‌లో 503.27 పాయింట్లు ఎగబాకి 54,252.53 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ కూడా 144.35 పాయింట్ల లాభంతో 16,170.15 వద్ద స్థిరపడింది.

డాలర్‌తో రూపాయి మారకం విలువ 2 పైసలు క్షీణించి 77.57 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, అపోలో హాస్పిటల్స్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు రాణించాయి. ఐటీసీ, యూపీఎల్‌, దివిస్‌ ల్యాబ్స్‌, సన్‌ ఫార్మా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. లోహ, ఐటీ, విద్యుత్‌, రియల్టీ, బ్యాంక్‌, చమురు రంగ సూచీలు 1-3 శాతం మేర పెరిగాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని