Stock Market: నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయంగా మార్కెట్లు నష్టాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. 

Published : 14 Jun 2024 09:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు నేడు మిశ్రమంగా ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం లాభాలతో మొదలైనా మెల్లగా నష్టాల్లోకి జారుకొన్నాయి. ఉదయం 9.41 సమయంలో సెన్సెక్స్‌ 191 పాయింట్లు నష్టపోయి 76,619 వద్ద, నిఫ్టీ 36 పాయింట్ల నష్టంతో 23,362 దగ్గర కొనసాగుతున్నాయి. ఆదిత్య బిర్లా ఎస్‌ఎల్‌, జనరల్‌ ఇన్స్యూరెన్స్‌, టింకెన్‌ ఇండియా, జయప్రకాశ్‌ అసోసియేట్స్‌, టిటాఘర్‌ రైల్‌ సిస్టమ్స్‌ షేర్లు లాభాల్లో ఉండగా..  లా ఒపాల ఆర్జీ , రెడింగ్టన్‌, ది రామ్కో సిమెంట్స్‌, బిర్లా సాఫ్ట్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 4 పైసలు కుంగి 83.52 వద్ద కొనసాగుతోంది. ఆసియా-పసిఫిక్‌ ప్రధాన సూచీలు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. జపాన్‌కు చెందిన నిక్కీ 138 పాయింట్లు లాభాల్లో ఉండగా.. చైనాకు చెందిన షాంఘై మార్కెట్‌ సూచీ 11 పాయింట్లు నష్టాల్లో ఉంది. ఇక కొరియాకు చెందిన కోస్పీ లాభాల్లో ఉంది. 

జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ షేర్ల డీలిస్టింగ్‌: జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ ముఖ్య ఆర్థిక అధికారి (సీఎఫ్‌ఓ)గా దేవాంగ్‌ ప్రవీణ్‌ పటేల్‌ నియమితులయ్యారు. స్టాక్‌ ఎక్స్ఛేంజీల నుంచి తమ షేర్లను డీలిస్ట్‌ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. జూన్‌ 21ను ఇందుకు రికార్డు తేదీగా నిర్ణయించారు. ఆ రోజుకు కంపెనీ షేర్లు కలిగిన వాటాదార్లకు, షేర్ల విలువను తిరిగి చెల్లిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని