Stock market: లాభాల్లో ముగిసిన సూచీలు.. సరికొత్త రికార్డులు తాకి వెనక్కి

Stock market: దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 204 పాయింట్లు, నిఫ్టీ 75 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.

Published : 13 Jun 2024 15:50 IST

Stock market | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు (Stock market) మరోసారి సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. భారత్‌తోపాటు అమెరికాలోనూ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో అంతర్జాతీయ మార్కెట్లతో మన మార్కెట్లూ లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 77,145.46 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాలను అందుకుంది. నిఫ్టీ సైతం 23,481.05 పాయింట్ల వద్ద ఆల్‌టైమ్‌ గరిష్ఠాలను టచ్‌ చేసింది. తర్వాత లాభాల స్వీకరణతో లాభాలు పరిమితమయ్యాయి.

సెన్సెక్స్‌ ఈ ఉదయం ఆరంభంలోనే 77,102.05 పాయింట్ల ఎగువన ప్రారంభమైంది. ఆద్యంతం లాభాల్లోనే కొనసాగింది. చివరికి 204 పాయింట్ల లాభంతో 76,810.90 వద్ద ముగిసింది. నిఫ్టీ 75.95 పాయింట్ల లాభంతో 23,398.90 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.55గా ఉంది. సెన్సెక్స్‌లో మహీంద్రా అండ్‌ మహీంద్రా, టైటాన్‌, ఎల్‌అండ్‌టీ, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. హిందుస్థాన్‌ యూనిలీవర్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌,  ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు నష్టపోయాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని