stock market: భారీ లాభాల్లో దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు భారీ లాభాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం 9.22 సమయంలో సెన్సెక్స్‌ 397 పాయింట్లు పెరిగి 56,066 వద్ద నిఫ్టీ 128 పాయింట్లు

Updated : 05 May 2022 09:34 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు భారీ లాభాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం 9.22 సమయంలో సెన్సెక్స్‌ 397 పాయింట్లు పెరిగి 56,066 వద్ద నిఫ్టీ 128 పాయింట్లు పెరిగి 16,805 వద్ద ట్రేడవుతున్నాయి. అన్ని రంగాల సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. అత్యధికంగా లోహరంగ సూచీ 1.67శాతం లాభపడింది. మ్యాట్రిమోని.కామ్‌, అపోలో పైప్స్‌, ఫ్యూచర్‌ కన్జ్యూమర్‌, రెయిన్‌ ఇండస్ట్రీస్‌, ఏబీబీ ఇండియా లాభాల్లో ఉండగా..  వర్ధమాన్‌ టెక్స్‌టైల్స్‌, లక్ష్మీ ఆర్గానిక్‌ ఇండస్ట్రీస్‌, ఫ్యూచర్‌ రిటైల్‌, సొనాటా సాఫ్ట్‌వేర్‌, అదానీ పవర్‌ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. 

అమెరికా మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడింగ్‌ను ముగించడం దేశీయ సూచీలకు బలాన్నిచ్చింది. అక్కడి ఎస్‌అండ్‌పీ 500 సూచీ రెండేళ్లలో అత్యధిక పెరుగుదలను నమోదు చేసింది. నేడు అదానీ పవర్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌, డాబర్‌ ఇండియా, ఫస్ట్‌సోర్స్‌ సొల్యూషన్స్‌, జిందాల్‌ స్టీల్‌, ఎంఎంటీసీ, మారికో, పీఅండ్‌జీ, ఎక్సైడ్‌, వోల్టాస్‌, టీవీఎస్‌ మోటార్స్‌ సంస్థలు నాలుగో త్రైమాసిక ఫలితాలను వెల్లడించనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని