- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
Services PMI: ధరలు పెరిగినా.. సేవలకు డిమాండ్ తగ్గలే
దిల్లీ: భారత్‌లో సేవారంగ కార్యకలాపాలు జూన్ నెలలో 11 ఏళ్ల గరిష్ఠానికి చేరాయి. ధరలు పెరిగినప్పటికీ.. సేవలకు డిమాండ్ పుంజుకోవడం గమనార్హం. ఎస్అండ్పీ నెలవారీ పీఎంఐ సూచీ 59.2గా నమోదైంది. మే నెలలో ఇది 58.9గా ఉంది. వరుసగా 11వ నెలా సేవా కార్యకలాపాల్లో విస్తరణ నమోదైంది. పీఎంఐ 50 కంటే ఎగువన ఉంటే వృద్ధిగా.. దిగువన నమోదైతే క్షీణతగా లెక్కిస్తారు.
కొవిడ్ సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటుండడంతో సేవలకు డిమాండ్ పెరుగుతోందని ఎస్అండ్పీ గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అసోసియేట్ డైరెక్టర్ పాలియానా డీ లిమా తెలిపారు. సేవలకు అధికంగా వసూలు చేస్తున్నప్పటికీ.. కొత్త ఆర్డర్లు అందుతున్నాయని పేర్కొన్నారు. మరోవైపు సేవల విక్రయ ధరలు వేగంగా పెరుగుతున్నట్లు తెలిపారు. పెరిగిన వ్యయ భారాన్ని కంపెనీలు వినియోగదారుల పైకి బదిలీ చేయడమే ఇందుకు కారణమన్నారు.
మరోవైపు సేవలకు డిమాండ్ పెరుగుతున్న కొద్దీ కొన్ని కంపెనీలు జూన్‌లో అదనపు నియామకాలు చేపట్టినట్లు లిమా తెలిపారు. మొత్తంగా ఈ రంగంలో ఉద్యోగ నియామకాలు పెరిగినట్లు వెల్లడించారు. తయారీ, సేవల కార్యకలాపాల విస్తరణను కలిపి సూచించే కాంపోజిట్ పీఎంఐ సూచీ జూన్ నెలలో 58.2గా నమోదైంది. మే నెలలో ఇది 58.3గా ఉంది
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Jacqueline Fernandez: రూ.200కోట్ల దోపిడీ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నిందితురాలే..
-
Sports News
Ricky Ponting : టీమ్ఇండియా స్టార్‌ను నాలుగో స్థానంలో ఆడిస్తే ఉత్తమం: రికీ పాంటింగ్
-
Movies News
Laal Singh Chaddha: ఐదురోజులైనా.. ఆ భారీ చిత్రం ఫస్ట్ డే వసూళ్లనూ దాటలేదు..!
-
India News
S Jaishankar: కుమారుడితో రెస్టారెంట్‌కు కేంద్రమంత్రి.. తర్వాత ఏం జరిగిందంటే..?
-
Politics News
KTR: మోదీజీ.. చిత్తశుద్ధి ఉంటే ఆ విషయంలో జోక్యం చేసుకోండి: కేటీఆర్
-
Sports News
Jemimah Rodrigues : ఆ విషయంలో.. ధోనీ, కోహ్లీ సరసన నేనూ చేరిపోయా: రోడ్రిగ్స్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Hrithik Roshan: హృతిక్! ముందు నీ సినిమా సంగతి చూసుకో..
- స్తంభనలోపాన్ని కట్టేయండి
- Pak PM: ఆసియా టైగర్ అవుతామనుకున్నాం.. కానీ, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాం
- Hyderabad News: అనుమానాస్పద స్థితిలో సాఫ్ట్వేర్ ఇంజినీరు మృతి
- Noida Twin Towers: అమాంతం నీరు కిందికి దుమికినట్లు.. భవనాలు కుప్పకూలుతాయి..!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (17/08/2022)
- IND vs ZIM : జింబాబ్వే వంటి జట్లతో ఆడటం.. ప్రపంచ క్రికెట్‌కు మంచిది!
- TSRTC: హైదరాబాద్‌లో ఇకపై ఆ రెండు గంటలూ ఉచిత ప్రయాణం..
- Offbeat: 99ఏళ్ల బామ్మ.. 100వ మునిమనవడిని కలిసిన వేళ!
- Dhanush: ధనుష్ రెమ్యునరేషన్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా?