11 నెలల కనిష్ఠానికి సేవా కార్యకలాపాలు

జూన్‌లో సేవా రంగ కార్యకలాపాలు 11 నెలల కనిష్ఠానికి చేరాయి. ఈ రంగంలో పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) 41.2గా నమోదైంది. అంతకుముందు నెలలో ఇది 46.4గా రికార్డయింది. పీఎంఐ 50కి దిగువన నమోదవ్వడం వరుసగా........

Updated : 05 Jul 2021 13:24 IST

దిల్లీ: జూన్‌లో సేవా రంగ కార్యకలాపాలు 11 నెలల కనిష్ఠానికి చేరాయి. ఈ రంగంలో పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) 41.2గా నమోదైంది. అంతకుముందు నెలలో ఇది 46.4గా రికార్డయింది. పీఎంఐ 50కి దిగువన నమోదవ్వడం వరుసగా ఇది రెండో నెల. పీఎంఐ సూచీ 50 పాయింట్లను మించితే ఆ రంగంలో వృద్ధిని సూచిస్తుంది. 50 పాయింట్ల లోపు ఉంటే క్షీణతకు సంకేతం. ఈ మేరకు ఐహెచ్ఎస్​ మార్కిట్​ నెలవారీ నివేదిక సోమవారం విడుదలైంది.

రెండో దశ కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో సేవారంగం దెబ్బతిననుందని ముందే అంచనా వేసినట్లు ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ప్రతినిధి లీమా తెలిపారు. వ్యాపారాలు, ఉత్పత్తి, ఉద్యోగాలు వేగంగా పడిపోయాయని పేర్కొన్నారు. అయితే, తొలి వేవ్‌తో పోలిస్తే పరిస్థితులు కాస్త మెరుగ్గానే ఉన్నాయన్నారు.  కేసుల విజృంభణ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఏప్రిల్‌లో ఈ రంగం మరింత నెమ్మదించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

మరోవైపు నిర్వహణ, పెట్టుబడి వ్యయాలు పెరిగిపోయాయని సర్వే వెల్లడించింది. దీంతో రానున్న నెలల్లో ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ నిర్దేశించుకున్న 2-6 శాతాన్ని మించిపోవచ్చని అంచనా వేసింది. మరోవైపు తయారీ కార్యకలాపాలు సైతం కుంగిన విషయం తెలిసిందే. దీంతో తయారీ, సేవల కాంపొజిట్‌ ఇండెక్స్‌ జూన్‌లో 43.1 శాతానికి కుంగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని