Social media influencers: 70% మంది వారు బలపర్చినవే కొంటారట!
Social media influencers: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు వీక్షకుల కొనుగోలు అభిరుచులను ఎలా ప్రభావితం చేస్తున్నారో తాజా యాస్కీ సర్వే తేల్చింది.
దిల్లీ: భారత్‌లో ప్రతి పది మందిలో ఏడుగురు.. సోషల్ మీడియా ఇన్‌ప్లుయెన్సర్లు బలపర్చిన ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకే ఇష్టపడుతున్నారని యాస్కీ సర్వే తెలిపింది. 18 ఏళ్లు దాటిన మొత్తం 820 మందిని సర్వే చేసి ‘అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ASCI)’ ఈ విషయాన్ని వెల్లడించింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టా, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో ఆదరణ పొందుతున్న వారు వీక్షకుల కొనుగోలు అభిరుచులను ఎలా ప్రభావితం చేస్తున్నారో ఈ సర్వే తెలియజేస్తోంది.
ఇన్‌ఫ్లుయెన్సర్లు ఎండార్స్ చేసిన ఉత్పత్తుల్లో ఇప్పటి వరకు కనీసం ఒకటైనా కొనుగోలు చేసినట్లు సర్వేలో పాల్గొన్నవారిలో 90 శాతం మంది తెలిపారు. 61 శాతం మంది మూడు కంటే ఎక్కువ ఉత్పత్తులు కొన్నట్లు పేర్కొన్నారు. 25 నుంచి 44 ఏళ్ల మధ్య వయసు వారిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల ప్రభావం అధికంగా ఉన్నట్లు సర్వేలో తేలింది. ప్రత్యేక బ్రాండ్‌తో ఆయా ఇన్‌ప్లుయెన్సర్లకు ఉన్న అనుభవం ఆధారంగానే వారిపై వీక్షకులు వారిపై విశ్వాసాన్ని పెంచుకుంటున్నారని తెలిసింది. ఈ విషయంలో పారదర్శకంగా లేకుండా తప్పుడు సమాచారాన్ని అందించేవారిని వీక్షకులు తిరస్కరిస్తున్నట్లు సర్వే తేల్చింది.
బ్రాండ్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లపై ఇప్పటి వరకు 2,767 ఫిర్యాదులు అందినట్లు యాస్కీ తెలిపింది. ఇరుపక్షాలు వారి మధ్య ఉన్న అనుబంధాన్ని వెల్లడించకపోవడమే దీనికి కారణమని పేర్కొంది. బ్రాండ్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లు వారి మధ్య ఉన్న అనుబంధాలను బహిర్గతం చేయాలని యాస్కీ 2021 మే నెలలో మార్గదర్శకాలు జారీ చేసింది. పర్సనల్ కేర్ విభాగంలో అత్యధిక ఫిర్యాదులు అందినట్లు తెలిపింది. అలాగే ఇన్‌స్టాలో ఉల్లంఘనలు అధికంగా ఉన్నట్లు పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ISRO: విక్రమ్, ప్రజ్ఞాన్‌లతో కమ్యూనికేషన్‌కు యత్నం.. ఇస్రో ఏం చెప్పిందంటే!
-
Anantapuram: పాఠశాలలో దారుణం.. పుట్టిన రోజు నాడే చిన్నారి మృతి
-
Jagadish Reddy: సూర్యాపేటలో 26న ఐటీ జాబ్ మేళా: జగదీశ్‌రెడ్డి
-
Mayawati: బీఎస్పీ ఎంపీపై భాజపా ఎంపీ అభ్యంతరకర వ్యాఖ్యలు... మాయావతి రియాక్షన్ ఇదే!
-
Sidharth Luthra: సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా మరో ట్వీట్
-
Nene Naa Movie ott: ఓటీటీలోకి వచ్చేసిన రెజీనా మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?