సంస్థలు ప్ర‌తిపాదించే తీర్మానాల్లో వాటాదార్ల ఓటే శాస‌నం

వాటాదార్లు క‌లిగిన సంస్థలు వ్యాపార కార్య‌క‌లాపాల‌కు సంబంధించిన నిర్ణ‌యాలు తీసుకునేందుకు వాటాదార్ల అనుమ‌తి ఉండాలి. ఎక్కువ శాతం ఓట్లు అనుకూలంగా వ‌చ్చిన‌ట్ల‌యితే తీర్మానం జ‌రిగి ఆ ప్ర‌తిపాద‌న కార్య‌రూపం దాల్చుతుంది. ఈ ప్ర‌క్రియ‌లో భాగంగా సంస్థ‌లు వాటాదార్ల‌ను ఓటింగుకు ఆహ్వ‌నిస్తాయి....

Published : 16 Dec 2020 13:16 IST

వాటాదార్లు క‌లిగిన సంస్థలు వ్యాపార కార్య‌క‌లాపాల‌కు సంబంధించిన నిర్ణ‌యాలు తీసుకునేందుకు వాటాదార్ల అనుమ‌తి ఉండాలి. ఎక్కువ శాతం ఓట్లు అనుకూలంగా వ‌చ్చిన‌ట్ల‌యితే తీర్మానం జ‌రిగి ఆ ప్ర‌తిపాద‌న కార్య‌రూపం దాల్చుతుంది. ఈ ప్ర‌క్రియ‌లో భాగంగా సంస్థ‌లు వాటాదార్ల‌ను ఓటింగుకు ఆహ్వ‌నిస్తాయి. ఈ ఓటింగ్ వివ‌రాల‌ను ప‌త్రికా ప్ర‌క‌ట‌న ద్వారా మ‌దుప‌ర్ల‌కు తెలియ‌జేస్తారు. ఓటింగ్ లో పాల్గొని త‌మ అభిప్రాయం తెలిపే అధికారం వాటాదార్ల‌కు ఉంటుంది.

ఫిబ్ర‌వ‌రి 7, 2017 న హెచ్‌డీఎఫ్‌సీ ఇచ్చిన ప్ర‌క‌ట‌న ఉదాహ‌ర‌ణ‌గా తీసుకుంటే…

ఈ ప్ర‌క‌ట‌న లో సాధార‌ణ, ప్ర‌త్యేక తీర్మానాలు తీర్మానాలు చేసేందుకు మ‌దుప‌ర్ల‌ను ఆహ్వానించింది. ఓటింగ్ కార్య‌క్ర‌మం నిర్వ‌హ‌ణ‌లో భాగంగా మ‌దుప‌ర్ల‌కు బ్యాలెట్ ప‌త్రాల‌ను పోస్ట‌ల్ , మెయిల్ ద్వారా జ‌న‌వ‌రి 31 న పంపించారు.

ఓటింగ్ ప్రారంభం : ఫిబ్ర‌వ‌రి 9, 2017
ఓటింగ్ ముగింపు : మార్చి 10, 2017
ఓటింగ్ ఫ‌లితాలు: మార్చి 13, 2017

అలా ప్ర‌క‌ట‌న వ‌చ్చిన త‌ర్వాత వాటాదార్లు బ్యాలెట్ విధానంలో లేదా ఎల‌క్ట్రానిక్ విధానంలో ఓటింగ్‌లో పాల్గొంటారు.

మునుపటి రోజుల్లో కేవ‌లం పోస్ట‌ల్ ప‌ద్ధ‌తిలో మాత్ర‌మే ఓటింగు నిర్వ‌హించేవారు. అయితే టెక్నాల‌జీ తెచ్చిన మార్పుల్లో ఈ- ఓటింగ్ కూడా ఒక‌టి. ప్ర‌స్తుతం ఓటింగ్ రెండు ప‌ద్ధ‌తుల్లోనూ జ‌రుగుతుంది. ఈ క‌థ‌నంలో మ‌దుప‌ర్లు ఈ- ఓటింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం.

మ‌దుప‌ర్లు ఈ- ఓటింగ్ చేయాలంటే…

ఈ−ఓటింగ్‌ అంటే…

ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ ను సంక్షిప్తంగా ఈ - ఓటింగ్ అంటారు. కంపెనీ ప్ర‌వేశ పెట్టిన ప్ర‌తిపాద‌న‌పై వాటాదార్లు త‌మ అభిప్రాయాన్ని తెలిపేందుకు ఎల‌క్టానిక్ ప‌ద్ధ‌తిలో ఓటు హక్కును వినియోగించుకోవ‌డం.

కీలక నిర్ణయాలైన బోర్డు కమిటీ మెంబర్ల మార్పు, పెట్టుబడుల తీరు, కంపెనీ విధివిధానాల నిర్ణయం లాంటివి చేసేటప్పుడు పోలింగ్‌ నిర్వహించి వచ్చిన ఫలితాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు.

పోస్టల్‌ బ్యాలెట్‌లో ఎదురవుతున్న సమస్యలను అధిగమించే ఉద్దేశంతో డిపాజిట‌రీ సంస్థ‌లు ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ విధానాన్ని తీసుకువ‌చ్చాయి.

  • సీడీఎస్‌ఎల్‌ అనుబంధ సంస్థ సీడీఎస్‌ఎల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ (సీవీఎల్‌) ఇంటర్నెట్‌ ఆధారిత ఈ−ఓటింగ్‌ను ప్రవేశపెట్టింది. షేర్‌హోల్డర్లు ఎలక్ట్రానిక్‌ రూపంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు www.evotingindia.com అనే వెబ్‌సైట్ ,
    ఎన్ఎస్‌డీఎల్ www.evoting.nsdl.com వెబ్‌సైటు ను అందుబాటులోకి తెచ్చాయి.

  • ఓటింగ్ గుడ‌వులో ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా వాటాదార్లు ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో ఓటు వేసే అవకాశం కలుగుతుంది.

సీడీఎస్ఎల్ ద్వారా ఈ-ఓటింగ్‌ వేసే విధానం:

a.png

ఓటింగ్ స‌మ‌యంలోవాటాదార్లు ఈ - ఓటింగ్‌ వెబ్ సైటు లోకి వెళ్లి షేరు హోల్డ‌ర్ పై క్లిక్ చేయాలి.

b.png

పై విధంగా పేజ్ తెరుచుకుంటుంది. కంపెనీ పంపిన యూజ‌ర్ ఐడీ ని నింపాలి. 

    . యూజ‌ర్ ఐడీగా సీడీఎస్ఎల్ లో అయితే 16 సంఖ్య‌ల బెన్ఫీషియ‌రీ ఐడీ . ఎన్ఎస్‌డీఎల్ లో అయితే 8 సంఖ్య‌ల డీపీ ఐడీ , 8 సంఖ్య‌ల క్ల‌యింట్ ఐడీ ఉంటుంది.

  • భౌతిక‌రూపంలో షేర్లు క‌లిగిన వారు ప‌ది సంఖ్య‌లోపాన్ సంఖ్య‌ను నింపాలి. భౌతిక రూపంలో షేర్లు క‌లిగిన వారు కంపెనీతో రిజిస్ట‌రైన ఫోలియో సంఖ్య‌ను నింపాలి.

  • గ‌తంలో ఏదైనా కంపెనీ ఈ-ఓటింగులో పాల్గొన్న వారు త‌మకున్న పాస్ వ‌ర్డ్ తో లాగిన్ అవ్వ‌చ్చు.

  • c.png

  • అనంత‌రం డీమ్యాట్ లేదా కంపెనీలో రిజిస్ట‌ర్ అయిన బ్యాంకు వివ‌రాలు లేదా జ‌న్మ‌దిన వివరాలు నింపి లాగిన్ అవ్వాలి.
    త‌రువాత పాస్ వ‌ర్డ్ స్క్రీన్ కి వెళ్తారు. పాస్‌వర్డ్‌ను తప్పనిసరిగా మార్చుకోవాలి.
  • e.png

మ‌దుప‌ర్లు త‌మ యూజ‌ర్ ఐడీ పాస్ వ‌ర్డ్ ల‌ను ఎంట‌ర్ చేసి ఓటింగ్ చేయ‌వ‌చ్చు.

g.png

  • లాగిన్ అయిన రోజు మ‌దుప‌ర్లు త‌మకున్న‌ షేర్ల ప్ర‌కారం ఓటింగ్ కు అవ‌కాశం ఉన్నకంపెనీలు స్క్రీన్ పై క‌నిపిస్తాయి.

  • ఓటు వేయాల్సిన కంపెనీ ఈవీఎస్ఎన్ నంబ‌ర్ పై క్లిక్ చేయాలి.

  • ఓటింగు పేజీపై వివ‌ర‌ణ‌తో కూడిన తీర్మానం ఉంటుంది .

  • అక్క‌డే ఓటు వేసేందుకు అవును/ కాదు ఆప్ష‌న్లు ఉంటాయి.

  • డీమ్యాట్ ఖాతాలో షేర్లు ఉన్న‌వారు పాస్ వ‌ర్డ్ మ‌రిచిపోతే ఫ‌ర్గాట్ పాస్ వ‌ర్డ్ పై క్లిక్ చేయాలి.

  • ఒక సారి ఓటు వేసిన తర్వాత దాన్ని మార్చడానికి, సవరించడానికి వీలుకాదు.

  • అన్ని తీర్మానాలకు ఓటేసే వరకూ ఓటింగ్‌ పీరియడ్‌లో ఎన్నిసార్లయినా లాగిన్‌/లాగాఫ్‌ కావచ్చు.

  • h.png

ఈ−ఓటింగ్‌తో ప్రయోజనాలు:

  • సంతకాల తనిఖీ, భౌతికంగా ఓట్ల లెక్కింపు లాంటివి ఉండవు కాబట్టి తక్కువ ఖర్చుతో పోలింగ్‌ ప్రక్రియ ముగుస్తుంది.

  • పోస్టల్‌ బ్యాలెట్ తో పోలిస్తే ఈ-ఓటింగ్‌లో ఖ‌ర్చు త‌క్కువ అవుతుంది

  • ఈ-ఓటింగ్‌తో ఓట్ల లెక్కింపు కచ్చితత్వంతో జరుగుతుంది.

  • ఓటింగ్‌ ఫలితాలను త్వరితగతిన ప్రకటించే వీలుంటుంది.

  • ఓటింగ్‌ ప్రక్రియ వేగవంతంగా, పారదర్శకంగా ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని