Union Budget 2022: అభివృద్ధి అనే ఇంజిన్‌కు శక్తి.. బడ్జెట్‌పై పారిశ్రామికవేత్తల స్పందనలివీ..!

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తం చేస్తూ తమ అభిప్రాయం వెల్లడించారు......

Published : 01 Feb 2022 19:43 IST

దిల్లీ: 2022-23 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌. అన్ని వర్గాల ఆకాంక్షల మధ్య సమతూకం తీసుకువచ్చేలా ఈ బడ్జెట్‌ను రూపొందించారు. దీనిపై పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమాల వేదికగా తమ అభిప్రాయాలు వెల్లడించారు.

* సాధించగలననే ధైర్యం నాదల్‌కు ఆస్ట్రేలియా ఓపెన్‌లో చారిత్రాత్మక విజయాన్ని అందించినట్లుగానే.. ప్రపంచ భౌగోళిక-రాజకీయ అల్లకల్లోలాల మధ్య భారతదేశాన్ని అభివృద్ధి మార్గంలో స్థిరంగా ముందుకు నడిపించేందుకు ఆర్థిక శాఖ మంత్రి నేడు అలాంటి ధైర్యాన్నే ప్రదర్శించారు. కరోనా తగ్గుముఖం పడుతున్న ఈ నేపథ్యంలో 2022 బడ్జెట్‌ అభివృద్ధి అనే ఇంజిన్‌కు శక్తినిస్తుంది... ఆర్‌పీజీ గ్రూప్‌ ఛైర్మన్‌ హర్ష గోయెంకా

సంక్షిప్తత ఎల్లప్పుడు పటిష్ఠంగానే ఉంటుంది. నిర్మలా సీతారామన్‌ అతి చిన్న బడ్జెట్ ప్రసంగం అత్యంత ప్రభావవంతమైనదిగా నిరూపితం కావొచ్చు... మహీంద్రా అండ్‌ మహీంద్రా అధినేత ఆనంద్‌ మహీంద్రా

* ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌ ఆశాజనకంగా ఉంది. ఆర్థిక వివేకంతోపాటు వ్యాపారం చేయడం సౌలభ్యంగా మారనుంది. బడ్జెట్‌లో సమతుల్యత కనిపిస్తోంది. ఓవరాల్‌గా.. ఎలాంటి నెగెటివ్ సర్ప్రైజ్‌లు లేని పాజిటివ్ బడ్జెట్...బయోకాన్ లిమిటెడ్ ఛైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌

* ఈ బడ్జెట్‌ ఎంతో బ్యాలన్సింగ్‌గా ఉంది. ఇది ఉద్యోగాలను సృష్టించేందుకు, తయారీని పెంచేందుకు, వ్యవసాయ-ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాల కల్పనకు సహాయపడే వృద్ధి-ఆధారిత విధానాలపై పెట్టుబడులను ప్రోత్సహించేలా రూపొందించారు. సంక్షిప్త, స్వల్పకాలిక వృద్ధి.. దీర్ఘకాలిక నిర్మాణాత్మక ప్రాధాన్యత కలయిక ఈ బడ్జెట్... బీఎస్‌ఈ ఎండీ ఆశిష్ చౌహాన్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని