మార్కెట్‌లోకి రాబోతున్న `షెమా` ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లు

`షెమా` ఎల‌క్ట్రిక్ రెండు కొత్త ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌ను త‌న షోరూమ్‌లో ప్ర‌ద‌ర్శించింది.

Published : 28 Dec 2021 11:31 IST

ఎల‌క్ట్రిక్ వాహ‌నాల ప‌రంప‌ర మెల్ల‌గా భార‌త్‌లో మొద‌ల‌వుతోంది. పెట్రో ఉత్ప‌త్తుల ధ‌ర‌లు కూడా ఈ ఎల‌క్ట్రిక్ వాహ‌నాల మీద వినియోగ‌దారుల దృష్టి ప‌డ‌టానికి కార‌ణ‌మ‌వుతోంది. వాహ‌నాల కంపెనీలు ఈ అవ‌కాశాన్ని అందిపుచ్చుకోవ‌డానికి ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నాయి. పెట్రోల్ వెర్ష‌న్ వాహ‌నాల‌ను ఇప్ప‌టిదాకా త‌యారుచేసిన కొన్ని కంపెనీలు ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను ప్ర‌వేశ‌పెట్టి ప్ర‌మోట్ చేయ‌డం మొద‌లు పెట్టాయి.

`షెమా` ఎల‌క్ట్రిక్ రెండు కొత్త ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌ను త‌న షోరూమ్‌లో ప్ర‌ద‌ర్శించింది. ప్ర‌స్తుతం ఈ కంపెనీ బ్రాండ్ 6 ప్రొడ‌క్ట్స్‌ను క‌లిగి ఉంది. 5 త‌క్కువ స్పీడ్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ విభాగంలో, ఒక‌టి హైస్పీడ్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ని త‌యారు చేసింది. ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్ ఇండియా ఎక్స్‌పో 2021లో `షెమా` ఎల‌క్ట్రిక్ దాని ఎల‌క్ట్రిక్ ద్విచ‌క్ర వాహ‌నాలు `ఎస్ఈఎస్ ట‌ఫ్` (హైస్పీడ్‌), `ఎస్ఈఎస్ హాబీ` (త‌క్కువ వేగం) వెళ్లే వాహ‌నాల‌ను ప్ర‌ద‌ర్శించింది. త‌క్కువ వేగం కేట‌గిరిలో `ఎస్ఈఎస్ జూమ్‌`, `ఎస్‌ఈఎస్ బోల్ట్‌` `ఎస్ఈఎస్ ఈగిల్‌` `ఎస్ఈఎస్ ట‌ఫ్‌` వంటి వాహ‌న శ్రేణిని ప్ర‌ద‌ర్శించింది. ప్ర‌స్తుతం `షెమా` బ్రాండ్‌లో 6 ప్రొడ‌క్ట్స్‌ ఉన్నాయి. 5 త‌క్కువ స్పీడ్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ కేట‌గిరీలో, ఒక‌టి ఫేమ్ 2 కేట‌గిరిలో హై స్పీడ్ వాహ‌నం ఉంది.ఇది త్వ‌ర‌లో వ‌స్తుంది. `షెమా` ఎల‌క్ట్రిక్ ప్ర‌స్తుతం 13 రాష్ట్రాల‌లో త‌న నెట్‌వ‌ర్క్‌లో 75 డీల‌ర్‌ల‌ను క‌లిగి ఉంది.

`షెమా` ఎస్ఈఎస్ ట‌ఫ్ (హై స్పీడ్‌) మ‌ల్టీ యుటిలిటీ ఎల‌క్ట్రిక్ బైక్ 150 కిలోల లోడింగ్ కెపాసిటీతో 150 కి.మీ. వ‌ర‌కు బ్యాట‌రీ బ్యాక‌ప్‌తో వెళ్ల‌డంతో పాటు 60 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది.

ఎస్ఈఎస్ హాబీః ఇది గ‌రిష్టంగా గంట‌కు 25 కి.మీ వేగంతో మాత్ర‌మే ప్ర‌యాణిస్తుంది. ఒక్క‌సారి ఛార్జ్ చేస్తే 100 కి.మీ దూరాన్ని క‌వ‌ర్ చేస్తుంది. పూర్తిగా ఛార్జ్ చేయ‌డానికి 4 గంట‌లు స‌మ‌యం ప‌డుతుంది.

భార‌త్‌లో  ఎల‌క్ట్రిక్ వాహ‌నాల మార్కెట్ కొత్త‌ది. వినియోగ‌దారులు ఈ వాహ‌నాల‌పై భారీ ఆశ‌లే పెట్టుకున్నారు. ఈ ల‌క్ష్యాల‌ను సాధించ‌డానికి వాహ‌న త‌యారీ కంపెనీల‌న్నీ వాహ‌నాల స‌మ‌గ్ర వృద్ధికి చురుకుగా పాల్గొన‌డం చాలా అవ‌స‌ర‌మ‌ని, ఈ ఆర్ధిక సంవ‌త్స‌రం చివ‌రి నాటికి, 2-3 కొత్త హై స్పీడ్ ప్రొడ‌క్ట్స్‌ని త‌యారుచేస్తామ‌ని `షెమా` ఎల‌క్ట్రిక్ వాహ‌నాల ప్ర‌తినిధి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని