Nominee: టర్మ్ ఇన్సూరెన్స్‌కి ఎంత మంది నామినీలు ఉండాలి?
టర్మ్ బీమాని తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఏర్పడే కుటుంబ ఆర్ధిక సమస్యలను పరిష్కరించుకోవచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: తక్కువ ప్రీమియంతో ఎక్కువ జీవిత బీమా రక్షణ ఉండాలంటే టర్మ్ ఇన్సూరెన్స్ మంచి ఎంపిక. అయితే, ఈ బీమాలో కట్టిన ప్రీమియం మెచ్యూరిటీ సమయంలో తిరిగి రాదు. కానీ ఆర్థిక భద్రత చాలా ఎక్కువ. ప్రస్తుతానికి ఇంకా కొనసాగుతున్న కొవిడ్-19 పరిస్థితుల్లో ప్రపంచం యావత్ కొత్త రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నందున టర్మ్ బీమా తీసుకోవడం చాలా అవసరం. పాలసీ వ్యవధిలో పాలసీ తీసుకున్న వ్యక్తి అకాల మరణం సంభవిస్తే వారి కుటుంబానికి బీమా హామీ మొత్తాన్ని చెల్లిస్తారు.
బీమాలో నామినీ ప్రాముఖ్యత: ఈ టర్మ్ బీమాలో కుటుంబ ప్రయోజనాలను కాపాడేందుకు నామినేషన్ ప్రక్రియ కీలకం. నామినేషన్ ప్రక్రియ ద్వారా, పాలసీదారు మరణించిన సందర్భంలో బీమా ప్రయోజనాలను కంపెనీ నామినీ బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేస్తారు. నామినీగా సాధారణంగా పాలసీదారు తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి లేదా పిల్లలు ఉంటారు. కొన్ని సందర్భాల్లో బంధువులను కూడా నామినీగా పేర్కొనవచ్చు.
నామినీగా మైనర్ ఉంటే..?: 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు నేరుగా క్లెయిమ్ ప్రయోజనాలను పొందేందుకు అర్హులు కానందున, ఇంకో వ్యక్తిని అపాయింట్ చేయడం చాలా ముఖ్యం. మైనర్ నామినీ యుక్త వయస్సు వచ్చే వరకు ఆర్థిక ప్రయోజనాలను నిర్వహించే బాధ్యత అపాయింటీపై ఉంటుంది.
బహుళ నామినీలు అవసరమా?: పాలసీదారులు నమ్మకం గల ఒకే నామినీని నియమించడం సర్వసాధారణం. అయితే, ఇది సరైనది కాదు. కొన్ని అరుదైన సందర్భాల్లో పాలసీదారుతో పాటు దురదృష్టవశాత్తూ నామినీ కూడా మరణిస్తే సమస్య మరింత జటిలమవుతుంది. అటువంటి విషయంలో ఒకే నామినీని నియమించడం వల్ల క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియ చాలా క్లిష్టంగా మారుతుంది. ఎందుకంటే బీమా కంపెనీకి పాలసీదారుడి చట్టపరమైన వారసుడిని గుర్తించడం కష్టమవుతుంది. అటువంటి పరిస్థితుల్లో అధిక సమయం తీసుకునే చట్టపరమైన ప్రక్రియ ద్వారా వెళ్లవలసి ఉంటుంది. బహుళ నామినీలను నియమించి, వారిలో ప్రతి ఒక్కరికీ నిర్ధిష్ట శాతం హామీ మొత్తాన్ని కేటాయించడం ద్వారా చాలా వరకు ఈ సమస్యను పరిష్కరించవచ్చు. కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు, భార్య పిల్లలను కూడా బహుళ నామినీలుగా పాలసీదారుడు పేర్కొనవచ్చు.
చివరిగా: పాలసీదారుడు పాలసీ గురించి నామినీలకు తెలియచేయడం, వారితో పాలసీ పత్రాలను పంచుకోవడం చాలా ముఖ్యం. అంతేకాకుండా, ప్రతి సంవత్సరం పాలసీ, నామినీ వివరాలను సమీక్షించాలి. ఏదైనా మార్పులుంటే బీమా కంపెనీకి తెలియజేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
స్టాక్ మార్కెట్ సూచీలు గరిష్ఠ స్థాయికి చేరుతుండటంతో ఇటీవల కాలంలో చాలామంది ఇందులో మదుపు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మూడేళ్లుగా ఈక్విటీల్లోకి వస్తున్న పెట్టుబడులే ఇందుకు నిదర్శనం -
31లోగా ఇవి పూర్తి చేయండి..
ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో మార్చి 31 నాటికి పూర్తి చేయాల్సిన కొన్ని పనులు.. ముగుస్తున్న పథకాల వివరాలను పరిశీలిద్దాం.. -
కొత్త ఆర్థిక సంవత్సరం ఇలా ప్రారంభిద్దాం...
ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే చాలా విషయాల్లో మార్పులు వస్తుంటాయి. ఆదాయపు పన్ను విషయం కావొచ్చు.. బ్యాంకింగ్ సంబంధిత లావాదేవీలు.. ఇలా ఎన్నో ఏప్రిల్ 1 నుంచి మనకు కొత్తగా కనిపిస్తుంటాయి -
అత్యవసర నిధి ఖర్చులను తట్టుకునేలా
అవసరాలు ఎప్పుడు ఏ రూపంలో పలకరిస్తాయో చెప్పలేం. ఇలా వచ్చేవాటిని తట్టుకునేందుకు ఆర్థికంగా సిద్ధంగా ఉండాల్సిందే. నెలనెలా ఆదాయం వచ్చేదాకా వీటిని వాయిదా వేయలేం. -
విశ్రాంత జీవితంలో తోడుగా
పదవీ విరమణ తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవకుండా, స్థిరమైన ఆదాయాన్ని అందించే పదవీ విరమణ పథకాలపై మదుపరుల్లో ఆసక్తి పెరుగుతోంది -
చిన్న, మధ్యస్త REITS ద్వారా స్థిరాస్తిలో పెట్టుబడులు.. సురక్షితమేనా?
తరతరాలుగా భారతీయులు స్థిరాస్తి, బంగారం వంటి సంప్రదాయ పెట్టుబడులను గౌరవిస్తున్నారు. మారుతున్న కాలంలో స్థిరాస్తి పెట్టుబడులకు మారో రూపమే SM REITS.. వీటి గురించి తెలుసుకోండి. -
PPF vs VPF: పీపీఎఫ్, వీపీఎఫ్‌లో ఏది బెటర్..?
PPF or VPF: వాలంటరీ ప్రావిడెండ్ ఫండ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో ఏది బెటర్ అని ఆలోచిస్తున్నారా? ఈ విషయాల్ని పరిశీలించాక మీ నిర్ణయం తీసుకోండి.. -
Foreign Trip: విదేశీ టూర్‌ను ఇబ్బంది లేకుండా ఎలా ప్లాన్ చేసుకోవాలి?
విదేశీ వెకేషన్‌ను ప్లాన్ చేయడానికి అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రయాణం ఇబ్బంది లేకుండా, సజావుగా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. -
Claim Ratio: ఆరోగ్య బీమా కంపెనీల క్లెయిమ్స్ రేషియో ఎంతెంత?
దేశంలో వివిధ బీమా సంస్థలకు సంబంధించి.. ఆరోగ్య బీమా పాలసీల క్లెయిం సెటిల్మెంట్ రేషియో ఎంత ఉందో ఇక్కడ చూడండి. -
కుటుంబానికి ధీమానిచ్చేలా.. బీమా పాలసీ
సంపాదించిన మొత్తంలో నుంచి పొదుపు, పెట్టుబడులకు కొంత కేటాయిస్తుంటాం. కుటుంబానికి ఆర్థికంగా అవసరమైన లక్ష్యాల సాధనకు ఇవి ఉపయోగడేలా చూసుకుంటాం. -
పన్ను ఆదా ఇలా చేద్దాం
ఆర్థిక సంవత్సరం ముగింపు దగ్గరకు వచ్చేసింది. పాత పన్ను విధానాన్ని ఎంచుకున్న వారు తమ పొదుపు,పెట్టుబడులను వెంటనే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. -
డెట్ ఫండ్లలో మదుపు చేస్తున్నారా?
ఈక్విటీ మార్కెట్లలో అనిశ్చితి కనిపిస్తుండటంతో చాలామంది సురక్షిత పథకాలపై దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీటిలో మదుపు చేసేటప్పుడు పరిశీలించాల్సిన అంశాలను తెలుసుకుందాం. -
Credit cards: క్రెడిట్ కార్డుదారులకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్!
Credit Cards: క్రెడిట్ కార్డుల విషయంలో ఏప్రిల్ 1 నుంచి మార్పులు రానున్నాయి. రివార్డులు, ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ విషయంలో బ్యాంకులు కీలక మార్పులు చేపట్టాయి. -
Health Insurance Claims: ఆరోగ్య బీమా క్లెయిమ్ విషయంలో ఈ తప్పులు చేయొద్దు!
Insurance claims: ఆరోగ్య బీమా క్లెయిమ్‌లు కొన్నిసార్లు తిరస్కరణకు గురవుతుంటాయి. కాబట్టి ఈ తప్పులు చేయొద్దు.. -
Health Emergency: ఆరోగ్య అత్యవసర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి?
జీవితంలో ఎలాంటి ఇబ్బంది వచ్చినా దాన్ని ఎదుర్కోడానికి మనం ఆర్థికంగా సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోండి.. -
Mutual Funds: మ్యూచువల్ ఫండ్ల ఉపసంహరణ సమస్య.. ఎన్ని రోజులు పడుతోందంటే?
మార్కెట్లలో మిడ్, స్మాల్‌క్యాప్ ఫండ్లలో ఉన్న తమ నిధులను మదుపుదార్లు ఉపసంహరించుకున్నప్పుడు నిధుల బదిలీకి వివిధ సంస్థలు కొంత సమయాన్ని తీసుకుంటున్నాయి. ఎంత మొత్తం ఉపసంహరణకు.. ఎంత సమయం తీసుకుంటున్నాయో ఇక్కడ చూడండి. -
Insurance Agent: బీమా ఏజెంట్‌ను ఎలా ఎంపిక చేసుకోవాలి?
చాలా మందికి వారి వ్యక్తిగత జీవితంలో బీమా చాలా అవసరం. పాలసీ కొనుగోలు సమయంలో ఏజెంట్/అడ్వైజర్ అవసరం పడొచ్చు. వీరి గురించి ఇక్కడ తెలుసుకోండి. -
ఆరోగ్య బీమా రోజువారీ ఖర్చులను అందించేలా...
వైద్య ఖర్చులు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. అదే సమయంలో ఆరోగ్య బీమా రంగంలోనూ ఎన్నో మార్పులు వస్తున్నాయి. -
స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గుల్లో అప్రమత్తంగా
స్టాక్ మార్కెట్ అంటేనే అనిశ్చితికి మారు పేరు. చిన్న వార్త వచ్చినా దానికి ప్రతికూలంగానో, అనుకూలంగానో స్పందిస్తుంటాయి. ఒక్క రోజులోనే మదుపరుల సంపద కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆవిరవుతుంది. -
స్థిరాస్తి రంగంలో...
హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ కొత్తగా హెచ్డీఎఫ్సీ నిఫ్టీ రియాల్టీ ఇండెక్స్ ఫండ్ అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్ఓ) ఈ నెల 21న ముగుస్తుంది. -
Health Insurance: విదేశాల్లో విద్యనభ్యసించే విద్యార్ధుల కోసం ఆరోగ్య బీమా
విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు ఆరోగ్య బీమా తప్పనిసరి. భారత్‌లో ప్రముఖ బీమా సంస్థలు విదేశీ విద్యార్థులకు అందించే బీమా సౌకర్యాలు ఇక్కడ తెలుసుకుందాం.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్‌లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం